ఆ లెక్కన గుంటూరు కారం హిట్టా .. ఫట్టా ?

మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు , ఖలేజా చిత్రాలు మొదట్లో డిజాస్టర్స్ అన్న జనాలే ఆ తరువాత బ్రహ్మరథం పట్టారు. ఇక.. గుంటూరు కారం కూడా నెగిటివ్ టాక్ వస్తోంది. మరి.. ఈ కాంబో కు ఉన్న సెంటి మెంట్ ప్రకారం ఈ మూవీ హిట్టా .. ఫట్టా ?

ఆ లెక్కన గుంటూరు కారం హిట్టా .. ఫట్టా ?
New Update

Trivikram- Mahesh Combo: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు చాలా పీక్స్ లో ఉంటాయి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఏ మాత్రం అటు ఇటు అయినా ఇక.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడాల్సిందే.ఇవన్నీ ఒక లెక్క. కానీ ఒక్కో కాంబినేషన్లో సినిమా అంటే .. జనాలకు హై ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. వాటిని రీచ్ అవ్వాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి మేకర్స్ కు. ఇప్ప్పుడు గుంటూరు కారం విషయంలో అదే జరిగింది.

అతడు సినిమాకు సైతం మిక్సిడ్ టాక్

మహేష్ - త్రివిక్రమ్ కాంబో గురించి చెప్పాల్సి వస్తే .. మొట్టమొదటి చిత్రం (Athadu Movie) అతడు మూవీ కి కూడా మొదటి రెండు రోజులు మిక్సెడ్ టాక్ వచ్చింది. ఎంతలా అంటే .. మహేష్ ను ఆ పాత్రలో చూడలేకపోయినంత. సైలెన్స్ గా మహేష్ ను చూడాలంటే ఇబ్బందిపడ్డారు. కానీ ఆ  పిత్రా తీరు తెన్నులు అంతే .. అలాగే ఉండాలి. ఎవరో పేరు మీద ఒకింటికి వెళ్లిన మనిషి ఎక్సట్రా లు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది, పైగా ..రాజీవ్ కనకాల పాత్ర మరణం .. ఒకరకంగా మహేష్ బాబు వల్లే వచ్చింది. సో.. ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో కరడుగట్టిన క్రిమినల్స్ అయితే వాళ్లకు భావోద్వేగాలు ఉండవు.అతడు సినిమాలో మహేష్ ఓ అనాధ . క్రిమినల్ గా మారాడు. కానీ భావోద్వేగాలు అన్నే కుటుంబ బంధాల చుట్టూనే నడుస్తాయి. ఈ సినిమా మొదట ఫెయిల్ అన్నారు. యావరేజ్ అన్నారు. చివరికి బ్లాక్ బస్టర్ అన్నారు. ఇప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్ లో హైయెస్ట్ టిఆర్పి తో దూసుకుపోతున్న సినిమా అతడు.

ఖలేజా డిజాస్టర్ అన్నారు . టీవీల్లో దుమ్మురేపుతోంది

ఇక..మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండో సినిమా ఖలేజా (Khaleja) . ఈ సినిమాకయితే విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. సినిమా డిజాస్టర్ అన్నారు. అనుష్క మహేష్ కు అక్కలా ఉందని అన్నారు. కథాకథనాలపై భీభత్సమైన కామెంట్స్ చేశారు. మహేష్ బాబుని దేవుడుగా పిలుస్తుంటే ఒళ్ళు కంపరమెత్తిపోయినవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సినిమా టీవీ లో వచ్చేటప్పుడు బ్రహ్మరధం పడుతున్నారు. అబ్బా .. గురూజీ ఏం సినిమా తీసాడండీ అదరగొట్టేసాడు అంటాయన్నారు జనాలు. ఇప్పటికే హైయెస్ట్ టిఆర్పి తో తిలివిజన్ ప్రీమియర్స్ లో అదరగొడుతోంది.

పక్కా కమర్షియల్ సినిమా గుంటూరు కారం

అతడు, ఖలేజా చిత్రాలు త్రివిక్రమ్ (Trivikram) శైలి సినిమాలు . తెలుగు సినిమా ఫార్ములాకు భిన్నమైన సినిమాలు . దాదాపు పన్నెండేళ్ల తరువాత వచ్చిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా పక్కా కమర్షియల్ సినిమా. మహేష్ బాబుని గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేశారు. టైటిల్ తగ్గట్టే ఊర మాస్ మ్యానరిజంతో త్రివిక్రమ్ మార్కుతో పాటు గా మసాలా రంగరించి సంక్రాంతి బరిలోకి దిగితే నెగిటివ్ టాక్ రావడం ఆశ్చర్యంగా ఉంది,. ఓ వైపు థియేటర్స్ లో హంగామా నడుస్తోంది. పాటలకు ఆడియన్స్ లేచి డ్యాన్సులు చేస్తున్నారు.మరో వైపు సినిమా బాగాలేదని పెదవి విరుస్తున్నారు.

వసూళ్లే చెబుతున్నాయి హిట్టో .. ఫట్టో

ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే .. త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో అతడు , ఖలేజా ఈ రెండు చిత్రాలు హిట్టా .. ఫట్టా ? ఈ రెండు చిత్రాలు మొదట్లో ఫ్లాప్ అన్నవాళ్ళే .. డిజాస్టర్స్ అని ఎవరయినా చెప్పగలరా ? ఆ లెక్కన గుంటూరు కారం రిజల్ట్ ఏంటో అర్ధం అవుతుంది. మొదటి రెండు చిత్రాల్లాగే ఈ సినిమాకూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని వసూళ్లే చెబుతున్నాయి.సంక్రాంతి సినిమాలకు కలెక్షన్లే కొలమానం. పైగా .. సంక్రాంతి మ్యానియా మరో వారం పాటు నడుస్తుంది. సినిమాను సినిమాలాగే చూడాలి. వినోదం అందిస్తుందా లేదా ? అంతే చూడాలి కానీ .. రివ్యూల పేరుతో ప్రతీ షాట్ ను పోస్ట్ మార్టం చేయడం ..ఫోన్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరు .. రివ్యూ లు ఇచ్చేస్తే .. నిర్మాతలు కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతుంది. తద్వారా చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది.సంక్రాంతికి వివిధ జానర్స్ లో సినిమాలు వస్తాయి. సినిమాల మధ్య పోలికలు చేసి హిట్ .ప్లాప్ అంచనా వేయలేము కదా . ఓ నాలుగు రోజులు ఆగితే అన్నీ డిసైడ్ అవుతాయి.

ALSO READ:గుంటూరు కారం నెగిటివ్ రివ్యూలపై స్పందించిన దిల్ రాజు

#guntur-kaaram #mahesh-babu #khaleja #athadu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe