Sithara : వైరల్ గా ప్రీన్స్‌ మహేష్ కూతురు సీతార వీడియో..ఏం చేసిందంటే..?

ప్రీన్స్‌ మహేశ్ బాబు కూతురు ఘట్టమనేని సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సితార స్టేజిపైకి రావడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని తానే స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. తండ్రి నట వారసత్వాని మాత్రమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు సితార.

Sithara : వైరల్ గా ప్రీన్స్‌ మహేష్ కూతురు సీతార వీడియో..ఏం చేసిందంటే..?
New Update

Sithara : ప్రీన్స్‌ మహేశ్ బాబు(Mahesh Babu) కూతురు ఘట్టమనేని సితార తన గొప్ప మనసును చాటుకున్నారు. చిన్న వయసులోనే వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. తాజాగ, సీతారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిసెంట్ గా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గెస్టులుగా నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) తో పాటు సితార కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కొంతమంది పేద ముసలి వాళ్లకి.. మ్యాక్స్(MAX) బ్రాండ్ బట్టలు అందచేసింది. అవి సితార చేతుల మీదుగా అందజేశారు. అందులో ఓ పెద్దావిడ స్టేజిపైకి ఎక్కడానికి ఇబ్బందిపడుతుంటే.. సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి పట్టుకొని పైకి ఎక్కించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్స్ సీతారపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ నట వారసత్వాని మాత్రమే కాకుండా.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. పెద్దల పట్ల గౌరవం చూపించే సందర్భాల్లో హోదాలు, అంతస్తులు గుర్తురావని సితార తన చేష్టలతో చూపించారని సీతారను కొనియాడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్  గారాల పట్టి సితార చిన్నతనం నుండే తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సితార జ్యువలరీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇక త్వరలో సినిమాల్లోకి కూడా రానుందని తల్లి నమ్రత ఇప్పటికే ప్రకటించారు.

Also Read: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ

#mahesh-babu #namratha-shirodkar #hyderbad #sithara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe