Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని.. ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు.
Also Read: అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీష ఫైర్.. మహిళా ఉద్యోగులను లైంగికంగా..
అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ కామెంట్స్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హీరో దళపతి విజయ్ పార్టీని ఉద్దేశించే నటుడు రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ పై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ కు హీరో రజనీకాంత్ సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ
హీరో దళపతి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన స్థాపించారు. 2026 ఎన్నికల్లో తన పార్టీ రంగంలోకి దిగుతున్నట్లు కూడా విజయ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జెండాను ఆయన గురువారం ఆవిష్కరించారు.