Samyuktha Menon to Act with Nikhil :అందుకే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో డిమాండ్ పెరిగింది. ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు చాలామంది మేకర్స్. అయితే సంయుక్త మీనన్ మాత్రం ఆశ పడడం లేదు. భారీగా డబ్బులొస్తున్నాయని ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
కథకు, అందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే అంగీకరిస్తోంది సంయుక్త. అందుకే ఇంత సక్సెస్‌లో ఉన్నప్పటికీ ఆమె నుంచి సినిమాలు తక్కువగా వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో సినిమా అంగీకరించింది. ఆ సినిమా పేరు స్వయంభూ(Swayambhu).
నిఖిల్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించింది సంయుక్త మీనన్. ఠాగూర్ మధు దీనికి నిర్మాత. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా, పీరియాడిక్ డ్రామాగా రాబోతోంది ఈ సినిమా. ఈ ప్రాజెక్టుపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు నిఖిల్. కార్తికేయ-2 తర్వాత, తనకు ఆ స్థాయిలో పాన్ ఇండియా అప్పీల్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. ఇప్పుడు సంయుక్త మీనన్ రూపంలో లక్కీ హ్యాండ్ కూడా తోడవ్వడంతో నిఖిల్ ఇంకా హ్యాపీ. మరో 4 రోజుల్లో ఈ సినిమా లాంఛ్ అవుతుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెడతారు.
త్రివిక్రమ్ కంట్లో పడిన హీరోయిన్లంతా సూపర్‌గా క్లిక్ అయ్యారు. సమంతను స్టార్‌ను చేశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత పూజాహెగ్డేతో వరుసపెట్టి సినిమాలు తీయడమే కాకుండా, ఆమెకు స్టార్ స్టేటస్ ఇచ్చాడు. వీళ్లిద్దరి మధ్యలో అనుపమ పరమేశ్వరన్‌ను కూడా పరిచయం చేశాడు. ఆమె కూడా టాలీవుడ్లో స్థిరపడిపోయింది. ఇలా త్రివిక్రమ్ చేయి పడిన హీరోయిన్లంతా సూపర్‌గా క్లిక్ అయ్యారు. సంయుక్త మీనన్‌ను కూడా భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌కు తీసుకొచ్చాడు త్రివిక్రమ్. బింబిసారలో కూడా అవకాశం త్రివిక్రమ్ వల్లనే వచ్చిందనే టాక్ ఉంది. అలా మాటల మాంత్రికుడి చలవతో ఇండస్ట్రీకొచ్చిన సంయుక్తకు అదృష్టం కూడా తోడవ్వడంతో వరుసపెట్టి హిట్స్ కొడుతోంది.
Also Read: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది