Sunscreen: సూర్యకాంతి నుంచి సన్‌స్క్రీన్‌లు నిజంగా కాపాడతాయా..? వేసవిలో సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది. ఈ సీజన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుని UV కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా వడదెబ్బ, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. By Vijaya Nimma 14 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sunscreen: సన్‌స్క్రీన్ ఎండ నుంచి రక్షణ కల్పిస్తుందని, తరచుగా బయటికి వెళ్లినప్పుడు వాడుతూ ఉంటారు. సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడితే అంత మంచిదనే ఉద్దేశంతో ఉంటారు. అయితే సన్‌స్క్రీన్ నిజంగా బలమైన సూర్యకాంతి నుండి రక్షిస్తుందా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ప్రతి సీజన్‌కు అనుగుణంగా చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యుని UV కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా వడదెబ్బ, వయస్సు ప్రభావం చర్మంపై కనిపించడం ప్రారంభమవుతుంది. చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలు సన్‌స్క్రీన్ క్రీమ్‌ను ఉపయోగిస్తారు. వాస్తవానికి సన్‌స్క్రీన్ చర్మంపై పొరలా పనిచేస్తుంది. ఇది సూర్యుని కిరణాల వల్ల కలిగే ప్రత్యక్ష నష్టం నుంచి రక్షిస్తుంది. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ వంటి ముఖ్యమైన అంశాలు సన్‌స్క్రీన్‌లో ఉంటాయి. ఇది చర్మాన్ని రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. సన్‌స్క్రీన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేది అందులో ఉండే సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ (SPS)పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే సన్‌స్క్రీన్ అంతబాగా పనిచేస్తుందని అంటున్నారు. సన్‌స్క్రీన్‌లో SPS 15 ఉంటే, చర్మం 15 రెట్లు ఎక్కువ సూర్యరశ్మిని పొందుతుందని అర్థం. సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్తే సన్‌బర్న్ అయ్యే ప్రమాదం 15 రెట్లు పెరుగుతుంది. బలమైన సూర్యరశ్మిని తట్టుకోవడానికి ఎల్లప్పుడూ 30-50 SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. సన్‌స్క్రీన్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు చర్మంపై అప్లై చేయండి. ప్రతి రెండు గంటల వ్యవధిలో దీన్ని అప్లై చేయండి. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాతే మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ వేసుకునే అమ్మాయిలు కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. కళ్ల కింద సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఐ బ్యాగ్‌లు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కేసు తీసుకోలేదని మహిళ పోలీస్‌స్టేషన్‌లో చేసిన పని చూడండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #sunscreen #sunlight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి