‘IFFI’ వేదికపై కన్నీరు పెట్టుకున్న సన్నీ డియోల్.. వాళ్లే తొక్కేశారంటూ

బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ గోవా వేదికగా జరుగుతున్న 'IFFI' వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. అలాగే సినిమా ఎప్పుడైతే కార్పొరేట్‌ శక్తుల్లోకి ప్రవేశించిందో అప్పటినుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.

New Update
‘IFFI’ వేదికపై కన్నీరు పెట్టుకున్న సన్నీ డియోల్.. వాళ్లే తొక్కేశారంటూ

International Film Festival of India: ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI) వేడుక గోవా వేదికగా కన్నుల పండుగగా జరుగుతోంది. సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేదికపై దర్శకుడు అనిల్ శర్మ, రాజ్ కుమార్ సంతోషిలతో కలిసి ఓ సెషన్‌లో పాల్గొన్న సన్నీ డియోల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవల తనకు మంచి విజయాన్ని అందించిన ‘గదర్‌ 2’, ఇందులో సన్నీ పోషించిన తారా సింగ్‌ పాత్ర, తన నట ప్రస్థానం గురించి మాట్లాడారు. ఇందులో భాగంగానే సన్నీ ప్రతిభకు చిత్ర పరిశ్రమ తగిన న్యాయం చేయలేకపోయిందని, కానీ దేవుడు న్యాయం చేశాడని రాజ్‌కుమార్‌ సంతోషి అన్నారు. దీంతో ఆ మాట వినగానే సన్నీ కన్నీరు పెట్టుకోవడం విశేషం.

Also read : అక్కను వేధిస్తున్నారని బావ కుటుంబంపై దారుణం.. ఏం చేశారంటే

ఇక ఈ సెషన్ లో సినిమా ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులను ఉద్దేశిస్తూ మాట్లాడిన సన్నీ.. ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్థికంగా దివాలా తీసింది అనే పదం వినడానికే కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులను నా కెరీర్ లో చాలాసార్లు ఎదుర్కొన్నా. కొన్నేళ్ల కిందట పరిస్థితులు నిర్మాతల అదుపులో ఉండేవి. డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థతో నిర్మాతకు నేరుగా సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే కార్పొరేట్‌ శక్తులు ప్రవేశించాయో.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రచారం, మార్కెటింగ్‌, పంపిణీదారులు.. ఇలా అన్నీ కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఏ థియేటర్లలో ఏ సినిమా ఆడాలో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు. ఈ విషయాలపై సరైన అవగాహన లేనివాళ్లు నష్టపోతున్నారు. గడిచిన పదేళ్లలో నేను ప్రతి సినిమాకీ ఇబ్బందిపడ్డా. ‘పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌’ (2019) తర్వాత బ్యాంకు రుణాలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాను నిర్మాణ బాధ్యతలు వదిలేసి పూర్తిగా నటనపైనే దృష్టి పెడతానని చెప్పారు. ఇక 1983లో వచ్చిన ‘బేతాబ్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన సన్నీ.. ఎన్నో వైవిధ్య భరిత పాత్రలతో అభిమానులను అలరించారు. ఇటీవల వచ్చిన ‘గదర్‌ 2’తోనూ మరోసారి రికార్డులు తిరగరాశారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు దాదాపు రూ.690 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు