Kejriwal: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.

Kejriwal: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!
New Update

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితునిగా పేర్కొంటూ తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ను కలిసేందుకు ఆయన భార్య సునీతకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. సోమవారం కేజ్రీవాల్‌ ను కలిసేందుకు ముందు ఆమెకు జైలు అధికారులు పర్మిషన్‌ ఇచ్చినప్పటికీ ..ఆకస్మాత్తుగా ఆ అపాయింట్‌ మెంట్‌ ను అధికారులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయం పై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా భగ్గుమంది. మోదీ సూచనల మేరకే జైలు అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు పరిచినట్లు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ముందు పర్మిషన్‌ ఇవ్వడం..వెంటనే దానిని రద్దు చేయడం పై పలు అనుమానాలున్నాయని ఆప్ నేతలు పేర్కొంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్‌ ను జైలు అధికారులు ఉగ్రవాదిలా పరిగణిస్తున్నారని ఆప్‌ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం అమానవీయతలో అన్ని హద్దులను దాటేసిందని పేర్కొంది. కాగా, సోమవారం కేజ్రీవాల్‌తో ఢిల్లీ మంత్రి అతిషి సమావేశం కానున్నారు. మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయనను కలవనున్నారు.

జైలులో ఖైదీలతో వారానికి గరిష్ఠంగా రెండు ములాఖత్‌లకే అనుమతి ఇస్తారు. ఈ క్రమంలోనే సునీతా పర్మిషన్‌ ను జైలు అధికారులు క్యాన్సిల్‌ చేసినట్లు తెలుస్తుంది. అతిషి. మాన్‌లు కేజ్రీవాల్‌తో భేటీ అయ్యాక.. మరోసారి సునీత‌కు ములాఖత్‌ను కేటాయిస్తారని సమాచారం.

Also read: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు!

#aap #sunitha-kejriwal #jail #kejriwal #mulakath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe