Sundeep Kishan: ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో.. సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ #SK30 సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. తాజాగా ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. #SK30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. By Archana 13 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ ఈ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం సందీప్ స్టార్ హీరో ధనుష్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. Also Read: Suvarna Sundari: ఓటీటీలో సువర్ణ సుందరి… ఏడాది తర్వాత స్ట్రీమింగ్ #SK30 సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ ఇది ఇలా ఉంటే ఈ యంగ్ హీరో తాజాగా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. మాస్ మహారాజ్ రవితేజకు 'ధమాకా' లాంటి 100కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. #SK30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఏకే ఎంటర్ టైమెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. "తన 30వ చిత్రాన్ని ప్రకటిస్తునందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు సందీప్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నారు. ఇక దర్శకుడు త్రినాథ్ రావు నక్కిని, బెజవాడ ప్రసన్న కుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరూ కలిస్తే హిట్ గ్యారెంటీ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'ధమాకా' చిత్రం 100 కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ కూడా పక్కా హిట్ అని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Sundeep Kishan (@sundeepkishan) Also Read: Jr.NTR- WAR 2: కేవలం 60 రోజుల్లో ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్.. హృతిక్ రోషన్ తో కలిసి అన్ని రోజులు మాత్రమే #sundeep-kishan #sundeep-kishan-next-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి