TS News: భారీ ఎండలతో తెలంగాణ రాష్ట్రం ఉడికిపోతుంది. భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత మార్క్ దాటింది. ఉదయం 9 నుంచే ఉక్కపోత షురూ అయితుంది. ఉదయం 11 దాటిందంటే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజు ఐదుర రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం హైదరాబాద్ లోని ఉప్పల్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 43.3 డిగ్రీల మార్కును దాటింది. మియాపూర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, కాప్రా, ఖైరతాబాద్, కూకట్ పల్లి ఏరియాల్లో 42 డిగ్రీలు దాటింది. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మార్చి నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగితే..మే నెలలో ఎలా ఉంటాయని జనం భయపడుతున్నారు. తాజాగా భారత వాతావరశాఖ చేసిన హెచ్చరికలు మారింత భయాందోళనకు గురిచేస్తుంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారీగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంతజయ్ మహాపాత్ర తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు నుంచి ఎనిమిది రోజులు హీట్‌వేవ్స్ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ప్రభావం ఉంటుందన్నారు. 23 రాష్ట్రాలు వేడిగాలుల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలను చేశామని తెలిపింది ఐఎండీ.
ఇది కూడా చదవండి: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!