Summer Tips: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. మీ పని అంతే జాగ్రత్త..!

సహజంగా కొంత మందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ సమ్మర్ లో మాత్రం ఇలాంటి ఫుడ్ తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇవి కడుపులో ఇబ్బంది, విపరీతమైన స్వెట్టింగ్, డీహైడ్రేషన్ కు కారణమవుతాయి.

Summer Tips: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. మీ పని అంతే జాగ్రత్త..!
New Update

Summer Tips: చాలా మందికి ఫుడ్ స్పైసీ తినాలని ఉంటుంది. ముఖ్యంగా ఘాటైన ఇండియన్ మసాలాలు తినడం మరింత ఇష్టపడతారు. కానీ వేసవిలో మాత్రం ఘాటు, కారంతో కూడిన ఆహారాలు తినకూడదని చెబుతున్నారు నిపుణులు. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఫుడ్స్ కడుపులో ఇబ్బంది, డీహైడ్రేషన్ సమస్యలను కలిగించే ప్రమాదం ఉంటుంది. అసలు వేసవిలో స్పైసీ ఫుడ్స్ తింటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం..

వేసవిలో స్పైసీ తింటే కలిగే నష్టాలు

  • సహజంగా వేసవి కాలంలో ఎండలు మండిపోతూ ఉంటాయి. ఈ వేడిలో స్పైసీ ఫుడ్స్ తినడం ద్వారా విపరీతమైన స్వెట్టింగ్ అవుతుంది. ఇది శరీరానికి ఇబ్బందిని కలిగిస్తుంది.
  • అల్లం, మిరియాలు వంటి ఘాటుతో కూడిన మసాలాలు వేసవిలో తినడం కడుపులో యాసిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి ఛాతీలో మంట, అజీర్ణతకు కారణమవుతాయి. వేసవిలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
  • అధిక మసాలాలు కడుపులో ఇబ్బందిని కలిగిస్తాయి. కడుపుబ్బరం, వికారం సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా శరీరంలో అధిక వేడి ఉన్నావారిలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

Summer Tips

  • స్పైసీ ఫుడ్స్ విపరీతమైన స్వెట్టింగ్ కు కారణమవుతాయి. దీని వల్ల శరీరంలోని ఫ్లూయిడ్ లాస్ ఎక్కువగా జరిగి... డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. అందుకే సమ్మర్ లో స్పైసీ, ఘాటు ఆహారాలను తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
  • కొంత మందిలో స్పైసీ ఫుడ్స్ తినడం మైగ్రేన్, తలనొప్పి సమస్యలను ప్రభావితం చేస్తాయి. వేడి కారణంగా ఇవి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
  • వేసవిలో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతల అసమతుల్యతలకు దారి తీస్తుంది. ఇది చిరాకు, తీవ్ర నీరసానికి కారణమవుతాయి.
  • ఎండాకాలంలో ఘాటు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ALSO READ:   ట్రోల్‌ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు మారిపోతారు భయ్యా

#summer-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe