Summer Hair Care : వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి

వేసవి కాలంలో తీవ్రమైన వేడి, తేమ నుంచి జుట్టును రక్షించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. రెగ్యులర్ కండీషనింగ్, ప్రాపర్ హైడ్రేషన్, UV ప్రొటెక్షన్ ప్రాడక్ట్స్ జుట్టును ఎండ నుంచి రక్షిస్తాయి.

New Update
Summer Hair Care : వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి

Hair Tips : వేసవి(Summer) లో జుట్టును సంరక్షించడం చాలా కష్టమైన పని. తీవ్రమైన వేడి, చెమట జుట్టు పాడవడం జరుగుతుంది. సమ్మర్ లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సింపుల్ టిప్స్(Simple Hair Tips) పాటించండి.

ప్రాపర్ హైడ్రేషన్

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం.. శరీరంతో పాటు జుట్టును కూడా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ స్ప్లిట్ ఎండ్స్, పొడి బారిన జుట్టుకు దారి తీస్తుంది.

జుట్టును కవర్ చేసుకోవాలి

తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు.. జుట్టును స్కార్ఫ్ లేదా ఏదైనా హ్యాట్ తో కవర్ చేసుకోవాలి. సూర్యుని నుంచి వెలువడే కొన్ని ప్రమాదకరమైన కిరణాలు జుట్టు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి.

హీట్ స్టైలింగ్ తగ్గించాలి

చాలా మంది డిఫరెంట్ హెయిర్ స్టైల్స్(Hair Styles) కోసం.. బ్లో డ్రైయర్‌లు, స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్స్ వంటి హీట్ స్టైలింగ్ టూల్స్(Styling Tools) వాడుతుంటారు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హీట్ కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. అందుకే వీటి వాడకాన్ని తగ్గించాలి.

హెయిర్ స్టైల్స్

సహజంగా చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు జుట్టును లూస్ గా వదిలేయడానికి ఇష్టపడతారు. కానీ సమ్మర్ లో మాత్రం ఇలాంటి తప్పులు చేయకూడదు. జుట్టును లూస్ గా వదిలేయడం ద్వారా సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బన్, పోనీటెయిల్స్ వేసుకోవడం సురక్షితం.

Also Read : Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే శరీరంలో అది తక్కువైనట్లే

Simple Hair Tips - Summer

UV ప్రొటెక్టెంట్‌

సూర్యుని హానికరమైన ప్రభావాల నుంచి జుట్టును రక్షించడానికి.. UV ప్రొటెక్టెంట్ ఉత్పత్తులను వాడడం మంచిది. ఇవి తీవ్రమైన ఎండ, తేమ నుంచి జుట్టును కాపాడతాయి.

రెగ్యులర్ కండీషనింగ్

జుట్టును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడానికి.. ప్రతీ వాష్ తర్వాత మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ అప్లై చేయాలి. ఇది జుట్టు పొడిబారడం, విరిగిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

క్లోరిన్, ఉప్పు నీటి నుంచి రక్షణ 

సహజంగా చాలా మంది వేసవిలో స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే స్విమ్మింగ్ కి వెళ్లే ముందు జుట్టు ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పూల్ వాటర్ లోని క్లోరిన్ ప్రభావం తగ్గించడానికి.. జుట్టును ముందుగా శుభ్రమైన నీటితో తడి చేయాలి.

Also Read : South Indian Dishes: బియ్యం పిండితో చేసే.. పాపులర్ సౌత్ ఇండియన్ డిషేస్

Advertisment
తాజా కథనాలు