పారిశుధ్య ఉద్యమకారుడు...సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు...!

‘సులభ్’పబ్లిక్ టాయిలెట్లతో దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని తీసుకు వచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంగళ వారం ఆయన పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఇంతలో ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు.

author-image
By G Ramu
New Update
పారిశుధ్య ఉద్యమకారుడు...సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు...!

‘సులభ్’పబ్లిక్ టాయిలెట్లతో దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని తీసుకు వచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంగళ వారం ఆయన పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఇంతలో ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు.

వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు తరలించారు. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్‌గా ఆయన తన జీవితాన్ని మానవ హక్కుల గురించి అవగాహన కలిగించేందుకు అంకితం చేశారు. పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.

ప్రముఖుల సంతాపం...!

పాఠక్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ మృతి చాలా బాధాకరమన్నారు. పరిశుభ్రత విషయంలో పాఠక్ ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకు వచ్చారని అన్నారు. పాఠక్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల సాధికారతకు పాఠక్ చేసిన కృషిని ప్రధాని మోడీ కొనియాడారు.

పాఠక్ బయోగ్రఫీ...!

2 ఏప్రిల్ 1943లో బిహార్ లోని వైశాలి జిల్లాలోని సాంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు. ఆయన తండ్రి రామేశ్వర్ పాఠక్ ఆయుర్వేద వైద్యుడు. పాఠక్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత ముజాఫర్ పూర్ లోని ఆర్డీఎస్ కాలేజీలో, అనంతరం బిహార్ లోని నేషనల్ కాలేజీలో సోషియాలజీ చదివారు. 1965లో ఆయనకు అమోలతో వివాహం అయింది.

జీవితాన్ని మార్చిన ఘటన...!

1968లో బిహార్ గాంధీ సెంటినరీ సెలబ్రేషన్ కమిటీలోని భాగీ ముక్తీ(స్కావెంజర్స్ విముక్తి) సెల్ లో సభ్యుడిగా చేరాడు. ఆ సంస్థలో మొదట ఆయన ట్రాన్స్ లేటర్ గా, ఆ తర్వాత పబ్లిసిటీ ఇంఛార్జ్ గా పని చేశారు. గాంధీ ఆలోచనలు ప్రచారం చేయడంలో ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. క్రమ క్రమంగా ఆయన గాంధీజి సిద్దాంతాల వైపు ఆకర్షితుడయ్యారు. అక్కడి నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది.

సులభ్ స్వచ్చ్ శౌచాలయా సంస్థాన్ ఏర్పాటు..!

5 మార్చి 1970న ఆయన రూ. 50,000 వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఆ మొత్తంతో సులభ్ స్వచ్ఛ్ శౌచాలయ సంస్థాన్ (క్లీన్ టాయిలెట్ ఇన్‌స్టిట్యూట్)ని లాభాపేక్ష లేకుండా స్థాపించారు. టూ పిట్ ఎకోలాజికల్ కంపోస్ట్ టాయిలెట్ అనే తన వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ తర్వాత 1974లో పాట్నాలో మొదటి టాయిలెట్ నిర్మించారు. అందులో 20 బాత్ రూమ్స్ నిర్మించారు. 10 పై చెల్లించి ఆ బాత్ రూమ్స్ ను వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ ల ద్వారా ఏడాదికి రూ. 500 కోట్ల ఆదాయం వస్తోంది. దేశంలో 8,500లకు పైగా పబ్లిక్ టాయిలెట్లను సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

అవార్డులు...!

పాఠక్ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2003లో గ్లోబల్ 500 రోల్ ఆఫ్ హానర్ లో ఆయనకు చోటు లభించింది. 2009లో ప్రతిష్టాత్మకమైన స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్ ఆయనకు లభించింది ఆయనకు ఇంకా ఎనర్జీ గ్లోబ్ అవార్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్, పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్ నుండి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డుల వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు