Sukesh Chandrasekhar: వయనాడ్ బాధితులకు సుకేష్ చంద్రశేఖర్ 15 కోట్ల సాయం! కేరళ వయనాడ్‌లో జరిగిన విధ్వంసంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి అండగా నిలిచేందుకు చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు.తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ కు సుకేశ్ లేఖ రాశాడు. By Bhavana 09 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి kerala Landslides: కేరళ వయనాడ్‌లో జరిగిన విధ్వంసంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారికి సాయం అందించేందుకు ఎందరో ముందుకు వచ్చారు. ఇప్పటికే అటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే వారికి అండగా నిలిచేందుకు చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ కు సుకేశ్ లేఖ రాశాడు. అంతేకాకుండా బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300 ఇళ్లను నిర్మించడానికి మరింత సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నట్లు సుకేశ్ తన లేఖలో రాసుకోచ్చాడు. తాను అందించే సాయం చట్టబద్దమైన వ్యాపార ఖాతాల నుంచి అందిస్తున్నట్లుగా సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఆఫర్ ని అంగీకరించి కొండచరియలు విరిగిపడిన విషాదంలో ప్రభావితమైన వారి సంక్షేమం, పునరావాసం కోసం దీనిని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. వయనాడ్ విలయంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కేరళకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. Also read: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్! #kerala #wayanad #sukesh-chandra-shekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి