Janaka Ayite Ganaka Movie : సుహాస్ 'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నేడు సుహాస్ బర్త్ డే కావడంతో చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు.

Janaka Ayite Ganaka Movie : సుహాస్ 'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
New Update

Janaka Ayite Ganaka Movie : యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే కథలు, కాన్సెప్ట్స్ తో హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక త్వరలోనే 'జనక అయితే గనక' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇక ఈ సినిమాలో సంగీర్తన హీరోయిన్‌గా నటించగా సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది.

Also Read : రామ్ చరణ్ కు రాఖీ కట్టిన నిహారిక.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

నేడు సుహాస్ బర్త్ డే కావడంతో మేకర్స్ చిత్ర రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. సరిగ్గా ఇదే రోజున రాజ్ తరుణ్ కొత్త మూవీ 'భలే ఉన్నాడే' రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటూ ఆ డేట్ కి ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.

#suhaas #janaka-ayite-ganaka-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe