Sudheer Babu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న మూవీ, డైరెక్టర్ ఎవరంటే?

యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు సంతకం చేశాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్‌ కల్యాణ్‌ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్‌ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం.

New Update
Sudheer Babu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసిన సుధీర్ బాబు.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న మూవీ, డైరెక్టర్ ఎవరంటే?

Sudheer Babu Signs Pan India Project : గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా కూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు.అందుకు తగ్గట్లు గానే సుధీర్ బాబు సినిమాలో తన ఊరమాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఇక తాజాగా ఈ హీరో ఓ పాన్ ఇండియా సినిమాకు సంతకం చేశాడు.

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్‌ కల్యాణ్‌ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్‌ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. రుస్తుం, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, ప్యాడ్‌, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి తెరకెక్కిస్తుండటం అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే ప్రకటన కూడా ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది.

Also Read : మరో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్.. టైటిల్ కూడా ఫిక్స్!

ఇక 2025 మార్చిలో శివరాత్రి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి సుధీర్‌బాబు మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా స్క్రిప్ట్‌ చాలా నచ్చింది. ఏడాది నుంచి ఈ టీమ్‌తో కలిసి ట్రావెల్‌ చేస్తున్నా. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకుల మనసును హత్తుకునే సినిమా ఇది" అని అన్నాడు.

Advertisment
తాజా కథనాలు