HaromHara : సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన 'హరోం హర' ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ!

సుధీర్ బాబు 'హరోం హర' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ రిలీ చేశారు. ఈ ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ ఎలివెంట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. వీటి కోసం సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

HaromHara : సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన 'హరోం హర' ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ!
New Update

HaromHara Trailer : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా 'హరోం హర' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. జ్ఞాన సాగర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకోగా.. గురువారం ట్రైలర్ రిలీ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ ఎలివెంట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది.

సుధీర్ బాబు మాస్ సంభవం

తాజాగా రిలీజైన ట్రైలర్ సుధీర్ బాబు తుపాకీ తయారు చేయడం నుంచి మొదలవుతుంది. 1989 చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తీసినట్లు ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది. ఇందులో సుధీర్ బాబు గన్స్ స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించాడు. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

Also Read : మోడీ బయోపిక్ లో నటిస్తా.. కానీ ఓ కండీషన్? – సత్యరాజ్

వీటి కోసం సుధీర్ బాబు రిస్కీ స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో సుధీర్ బాబు చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ కి తగ్గ మాస్ మూవీ ఇదేనేమో అనిపిస్తుంది. ట్రైలర్ ఆ రేంజ్ లో ఉంది.

మొత్తంగా కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ సుధీర్ బాబుకి ఈ సినిమా గట్టి కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 14 న విడుదల కానుంది.

#sudheer-babu #haromhara-movie-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe