Sudha Murthy: రాజ్యసభ మెంబర్‌గా సుధామూర్తి ప్రమాణం

రాజ్యసభ సభ్యురాలిగా సుధామూర్తి ఈరోజు ప్రమాణం చేశారు. కొన్నిరోజుల క్రితం ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆమెకు అభినందనలు తెలిపారు.

New Update
Sudha Murthy: రాజ్యసభ మెంబర్‌గా సుధామూర్తి ప్రమాణం

Sudha Murthy Takes Oath as Rajya Sabha Member: ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Infosys Narayana Murthy) భార్య, సామాజిక కార్యకర్త అయిన సుధామూర్తి ఇవాళ రాజ్యసభ సభ్యరాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ స్పీకర్ సమక్షంలో ప్రమాణ ప్రతం చదివి దాని మీద సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, మరికొందరు రాజ్యసభ సభ్యులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. అంతకు ముందే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారని ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ (PM Modi) ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఆమె మహిళలు, పిల్లల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పిల్లల కోసం ఎన్నో మంచి పుస్తకాలు కూడా రాశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యరాలిగా తన పూర్తి బాధ్యతలను నెరవేరుస్తానని అంటున్నారు సుధామూర్తి. తనకు వచ్చిన అవకాశం ద్వారా మరింత మందికి సేవ చేస్తానని చెబుతున్నారు.

సుధ-నారాయణమూర్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి కుమార్తె అక్షతా మూర్తి ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ భార్య. అక్షత బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా గుర్తింపు పొందింది. ఇక వీరి కుమారుడు రోహన్ మూర్తి అమెరికా ఆధారిత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థ సొరోకో వ్యవస్థాపకుడు. ఇది డేటాను అర్థవంతమైన సమాచారంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా అమెరికన్ సంస్కృత పండితుడు షెల్డన్ పొల్లాక్ నేతృత్వంలోని క్లే సంస్కృత లైబ్రరీ ప్రాజెక్ట్‌లో భాగంగా రోహన్ మూర్తి దేశంలో మూర్తి క్లాసికల్ లైబ్రరీని కూడా స్థాపించారు.

Also Read:Andhra Pradesh : పొత్తు సరే.. సీట్లు ఎలా? నేతల్లో గుబులు

Advertisment
Advertisment
తాజా కథనాలు