Breaking: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతారణం

హైదరాబాద్‌లో గరువారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. కానీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Breaking: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతారణం

Breaking: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతారణం మారింది. ఇత కొద్ది రోజూల నుంచి మండే ఎండలతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలకు గరువారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈనెల 19 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోకి రుతుపవనాల ప్రవేశించే అవకాశం ఉందని, క్రమంగా ఉపరితల ద్రోణి బలహీన పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలుపుతున్నారు. కూకట్‌పల్లి, నిజాంపేట, హైదర్‌నగర్, బాబుపల్లి, కేపిహెచ్‌ప, ఐషీర్‌బాగ్‌, కోఠి, ముషీరాబాద్‌, హిమాయత్‌నగర్‌, లక్టికపూర్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, షాపూర్, జీడిమెట్ల, సూరారం కాలనీతోపాటు పలు చోట్లు వర్షం కురిసింది. రాబోయే మూడురోజులపాటు, ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే వెల్లడించింది. నగరవాసులు వర్షం కారణంగా ఇబ్బంది పడకుండ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రానున్న రోజుల్లో ఈ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు.. మహిళలు జాగ్రత్తగా ఉండాలి!

Advertisment
తాజా కథనాలు