AP: పిల్లలే పని మనుషులు.. గురుకులంలో వెట్టిచాకిరి చేస్తున్న విద్యార్థులు.! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు వెట్టిచాకిరి చేయిస్తున్నారు. విద్యార్థులతో ఈ రోజు ఒకేసారి 700 చపాతీలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై వార్డెన్‌ను ప్రశ్నించగా కేవలం ఇద్దరు వంట మనుషులు మాత్రమే ఉండడంతో విద్యార్ధులు చేశారని చెప్పారు. By Jyoshna Sappogula 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Prakasam: ఆడుతూ.. పాడుతూ.. సొంతోషంగా చదువుకోవాల్సిన విద్యార్ధలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గురుకుల సంక్షేమ వసతి గృహంలో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులే వంట మాస్టర్లు.. పిల్లలే పని మనుషులు. ఇద్దరు వంట మనుషులు మాత్రమే ఉండటంతో విద్యార్థులతో ఒకేసారి 700 చపాతీలు చేయించారు. Also Read: తిరుపతిలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం.. జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు..! ఈ విషయంపై హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించగా.. ఇదేమి తమకు కొత్త కాదని.. కేవలం ఇద్దరు వంట మనుషులు ఉండటంతో విద్యార్థులు చేపాతీలు చేశారని సింపుల్ గా సమాధానం చెప్పారు. పిల్లలను కాపాడుతూ.. సంరక్షించాల్సిన వార్డన్ బాధ్యత రహితంగా మాట్టాడారు. విద్యార్ధులు మాత్రం.. తమ గోడు చెప్పుకోలేక, సమస్యను తీర్చే నాథుడే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: లిక్కర్‌లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..! పిల్లలకు మంచి ఆహరం అందిస్తూ, చదువుకోవడానికి కృషి చేయాల్సిన వార్డన్.. విద్యార్థులను వంట మనుషులుగా మార్చడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వంట చేసేవారు లేరని పిల్లలతో వంట చేయించడం ఎంత వరకు కరెక్ట్ అని ప‌్రశ్నిస్తున్నారు. #ongole #yarragondapalem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి