KU: కేయూలో ఉద్రిక్తత.. రిజిస్ట్రార్ ను బంధించిన విద్యార్థులు! కేయూలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి విద్యార్థులు నిర్భంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ రూమ్ లో పై పెచ్చులు ఊడి, బాలికలు పడుకునే బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. By Bhavana 13 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Kakatiya University: కేయూలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి హాస్టల్ విద్యార్థులు నిర్భంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ రూమ్ లో పై పెచ్చులు ఊడి, బాలికలు పడుకునే బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటo ఆడుతున్నారని వెంటనే రిజిస్ట్రార్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్థరాత్రి ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన సదుపాయాలు లేవంటూ, పాములు, కుక్కలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన గుడ్లు పెడుతున్నారని, ఎన్నిసార్లు దీని గురించి అధికారులకు చెప్పిన ఇలాంటి స్పందన లేదని విద్యార్థినులు మండిపడ్డారు. పోతన హాస్టల్ నందు చెకింగ్ కి వచ్చిన రిజిస్టర్ ని తాళం వేసి బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టే లేదని విద్యార్థుల డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో ఓ గదిలోని స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడింది. కానీ ఆ సమయంలో ఆ రూంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఇటీవల ఫ్యాను ఊడి పడి ఒక అమ్మాయికి తల పగిలిన ఘటన హాస్టల్ లో చోటుచేసుకుంది. .. అప్పుడు అందరు వచ్చారు హడావిడి చేశారు.. అంతే కానీ బిల్డింగ్ నీ చేంజ్ చేసే ప్రయత్నం ఎవరు చేయలేదన్నారు. మళ్లీ రెండోసారి హాస్టల్ గదిలో పెచ్చులు ఉడిపడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని తెలిపారు. ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి అన్నారు. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also read: రాజ్‌తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య! #warangal #ku #rigister #slab-collapsed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి