ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దు.. మా బాధను అర్థం చేసుకోండి దామెరకుంటలో గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, మెనూ సరిగా పాటించడం లేదని ఆరోపిస్తూ రహదారిపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అధికారులు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. By Vijaya Nimma 11 Aug 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాధాన్యత అత్యంత ఘననీయంగా పెరిగింది. గురుకులాల్లో ప్రవేశం పొందాలంటే మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థులు మాత్రమే సీటు పొందే పరిస్థితి ఉంది. గురుకుల విద్యా సంస్థల విద్యార్థులకు పారదర్శంగా సీట్లు కేటాయిస్తుంది. గురుకులాల్లో సీటు పొందలనుకునే విద్యార్థుల కోసం గురుకుల విద్యా సంస్థ ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేసి అందరికి అందుబాట్లో ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. Your browser does not support the video tag. రోడెక్కిన విద్యార్థులు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటలో జరిగింది. నిత్యం పిల్లలకు మెనూ ప్రకారం భోజనాలు, టిఫిన్స్ ఇతరత్రా ఇవ్వకటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ తదితరులు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి కూడా విద్యార్థులను వేదిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెరేట్స్ వస్తే కలవనివ్వటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక ఆరోపణలు తట్టుకోలేక ఈ రోజు దామెరకుంట రోడ్డు మీద బైఠాయించిన మరి వారి బాధను వెల్లడించారు. Your browser does not support the video tag. ప్రిన్సిపాల్ మాకు వద్దు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఆరోపించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిచటం లేదని విద్యార్థులు వాపోయ్యారు. బంగారు భవిష్యత్తు వేసేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు కానీ ఇక్కడ సమస్యలను పరిష్కారించటంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. పాఠశాలలో వసతి గృహంలో భోజనం సరిగా లేదని విద్యార్థులు మండిపడ్డారు. మాకు ప్రిన్సిపాల్‌తో సమస్య ఉందని.. ఆమె మాకు వద్దు అంటూ విద్యార్థులు ఆరోపణలు చేశారు. కనీసం మాకు బుక్స్ కూడా ఇవ్వటం లేదన్నారు. మాకు మంచి చదువును అందించకుండా.. మాపై అనవసరంగా ఎవరితో పడితే వారితో అసభ్యకరంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వార్డెన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఎలాంటి స్పందన లేదన్నారు. వసతులు సక్రమంగా లేకపోవడంతో అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు, ఎమ్మెల్యే స్పందించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుకోవాలని.. మా సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని విద్యర్థులు డిమాండ్ చేశారు. #students #jayashankar-bhupalapalli #damerakunta-gurukula-school మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి