/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/btech-jpg.webp)
Kurnool : ఏపీ(Andhra Pradesh) కర్నూలు(Kurnool) జిల్లాలో దారుణం జరిగింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని(B.Tech Student) కాలేజీ హాస్టల్ బాత్ రూమ్(Hostel Bathroom) లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెట్ల మళ్లాపురానికి చెందిన ఉమా మాధురి అనే విద్యార్థిని పాణ్యం ఆర్‌జీఎం ఇంజినీరింగ్(RGM Engineering College) కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యింది.
ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలోనే ఆమె శనివారం రాత్రి 9 గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాస్టల్ కు వెంటనే రావాలని చెప్పింది. రాత్రి 10 గంటల సమయంలో ఉమా మాధురి(Uma Madhuri) బాత్ రూమ్ కు వెళ్లగా ఆమె అక్కడ పండంటి ఆడబిడ్డకు(Baby Girl) జన్మనిచ్చింది.
ఈ క్రమంలోనే ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో స్పృహా తప్పి పడిపోయింది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించగా వారు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని కాలేజీ యజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచింది. అసలు ఉమా మాధురిని మోసం చేసింది ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
అయితే ఉమా మాధురి గర్భం దాల్చిన విషయం గురించి తోటి విద్యార్థినులు తెలియదు అంటున్నారు. ఆమెకు నెలలు నిండి బిడ్డ పుడితే కనీసం రూమ్మేట్స్ కూడా ఏమి తెలియదు అనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: రాజకీయాలకు గల్లా గుడ్ బై!