Pithapuram: పిఠాపురంలో హై అలర్ట్.. వారికి ఐజీ సీరియస్ వార్నింగ్!

పిఠాపురంలో అలర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజి ఎం.రవి ప్రకాష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జూన్ 6 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంటాయని చెప్పారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Pithapuram: పిఠాపురంలో హై అలర్ట్.. వారికి ఐజీ సీరియస్ వార్నింగ్!
New Update

High Alert In Pithapuram: ఏపీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇక్కడినుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. కాగా రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్లు అల్లర్లు కొనసాగుతుండగా.. ఏలూరు రేంజ్ ఐజి ఎం.రవి ప్రకాష్ (IG Ravi Prakash) ప్రెస్ మీట్ నిర్వహించి అలర్లు సృష్టించే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏలూరు రేంజ్ అన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టినట్లు తెలిపారు.

ఎస్పి రేంజ్ అధికారుల నిఘలో..
అన్ని సెన్సిటివ్ ఏరియాల్లో ఎస్పి రేంజ్ అధికారుల నిఘలో ఉంటాయి. రాజనగరం, కాకినాడ ,పిఠాపురం మొదలగు ప్రాంతాలు చాలా సెన్సిటివ్ గా ఉన్నట్లు గుర్తించాం. గెలుపోటములు అనేవి సహజం. కాబట్టి ప్రజలందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నా. 6 తారీకు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంటాయి. ఎవరు కూడా రెచ్చగొట్టే ధోరణి, సెల్ ఫోన్ ద్వారా, టపాసులు పేల్చడం గాని, ఇతరత్రా కార్యక్రమాలు ద్వారా గాని చెయ్యరాదు. అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రౌడీషీటర్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది.

పిఠాపురం టౌన్ లోకి వచ్చే కత్తిపూడిబైపాస్, సామర్లకోట, కాకినాడ బైపాస్ రోడ్లపై కట్టుదిట్టమైన నిఘా పెట్టడం జరిగింది. అలాగే లాడ్జిలు, హోటల్లో, గెస్ట్ హౌస్ లపై నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. అన్ని పార్టీల వారు పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచిన వారు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ఎదుట పార్టీ వారిపై దాడులు చేయరాదు. అలాంటి వారిపై చట్టపరంగా సివియర్ యాక్షన్ తీసుకుని రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

Also Read: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

#pawan-kalyan #pithapuram #vanga-geetha #ig-m-ravi-prakash
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe