Strange Tradition: వామ్మో ఇదెక్కడి ఆచారం..పెళ్లి కూతురిపై ఉమ్ము వేస్తారా.?

ప్రపంచంలో కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు కొందరు ప్రజలు ఇంకా పాటిస్తున్నారు. రోజులు మారినా మూర్ఖపు ఆచారాలు, పెళ్లిళ్ల విషయంలో కొన్ని వింత‌ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివాహానంతరం ఆ పెళ్లికి వచ్చిన అందరూ పెళ్లికూతురు తలపై ఉమ్మివేసే ఆచారం కెన్యాలో కొనసాగుతుంది.

New Update
Strange Tradition: వామ్మో ఇదెక్కడి ఆచారం..పెళ్లి కూతురిపై ఉమ్ము వేస్తారా.?

Strange Tradition: ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం, ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. చాలా ప్రాంతాల్లో వింత వింత కట్టుబాట్లు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సాంప్రదాయాలు చూసేందుకు దారుణంగా ఉన్నా ప్రజలు మాత్రం వాటిని పాటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా వివాహాల విషయంలో ఆచారాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకును చీపురు మీద నుంచి దాటించడం, మృతదేహంతో పెళ్లి చేసి మరొకరితో పెళ్లి చేయడం వంటి ఎన్నో ఆచారాలను చూస్తూ ఉంటాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. పురాతన కాలం నుంచి వారి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఆయా తరాల వారు పాటిస్తూ ఉంటారు. అలాంటి ఓ వింత పెళ్లి ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లికుమార్తె ఉమ్మివేయడం  అక్కడి సాంప్రదాయం

కెన్యా దేశంలో ఒక ఆచారం నెట్టింట వైరల్‌గా మారింది. కెన్యాలోని మస్సాయ్‌ అనే తెగ కట్టుబాట్లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆచారాలను మాత్రం తూచాతప్పకుండా ఆ తెగవారు పాటిస్తారు. అయితే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం అక్కడి సాంప్రదాయం. ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పెళ్లికుమార్తె తండ్రి ఆమె తలతో పాటు ఎదపై ఉమ్మేయాలి. ఇలా చేస్తే కుమార్తెకు మంచి జ‌రుగుతుంద‌ని అక్కడివారి నమ్మకం. తండ్రి ఉమ్మి వేసిన తర్వాతే పెళ్లిలో మిగతా కార్యక్రమాలను జరిపిస్తారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత వచ్చిన బంధువులంతా పెళ్లి కుమార్తె తలపై ఉమ్మి వేస్తారు.

ఇది కూడా చదవండి:  నూడుల్స్, ఫ్రైడ్ రైస్‌లో వేసే అజినోమోటో తింటే ఆస్పత్రిలో బెడ్‌ బుక్‌ చేసుకోవాల్సిందే!

ఇలా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తే తమ పిల్లలు మంచిగా ఉంటారనేది తల్లిదండ్రుల విశ్వాసం. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా పిల్లల సంతోషం కోసం తప్పదని అంటున్నారు. ఇలాంటి మూర్ఖపు ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంచి మనసుతో పిల్లలను ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇంకా పాతకాలపు కట్టుబాట్లను పాటించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అయితే కెన్యాలాంటి వెనుకబడిన దేశాల్లో ఇంకా పెద్దల కట్టుబాట్లను పాటిస్తూ ఉంటారు. కానీ ఇకనైనా మారితే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు