Strange Love Story: విజయవాడలో వింత ప్రేమ కథ.. మగాడి చేతిలో మోసపోయిన మగాడు

విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ కాలేజీలో(2019) బీఎడ్ చదివే సమయంలోనే అలోకం పవన్, ఎలి నాగేశ్వర రావు మధ్య ప్రేమ చిగురించింది. సుమారు ఆరు సంవత్సరాలుగా పవన్, నాగేశ్వర రావు సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకున్నారు. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లి ప్రియుడు నాగేశ్వర రావు పవన్ కు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించాడు. పవన్ ను భ్రమరాంబికగా మారడానికి రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయి. అవయవ మార్పిడి ఆపరేషన్ కు అవసరమైన ఖర్చును మొత్తం పవనే భరించాడు. అలాగే నాగేశ్వరరావును నమ్మి అతనికి 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదు ఇచ్చాడు పవన్. కట్ చేస్తే.. పవన్ అలియాస్ భ్రమరాంబిక ఆపరేషన్ చేసిన ఏడాది తర్వాత నాగేశ్వర రావు అసలు రూపం బయట పడింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లికి నిరాకరించాడు నాగేశ్వర రావు. దీంతో భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భ్రమరాంబిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియుడు నాగేశ్వర రావు పరారీలో ఉన్నాడు.

New Update
Strange Love Story: విజయవాడలో వింత ప్రేమ కథ.. మగాడి చేతిలో మోసపోయిన మగాడు

విజయవాడలో వింత ప్రేమ కథ వెలుగు చూసింది. ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు బీఈడీ టీచర్లు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఏకంగా ప్రేమికుడి కోసం ట్రాన్స్ జెండర్ గా మారేంతగా. కట్ చేస్తే.. ట్రాన్స్ జెండర్ లా మారిన తర్వాత లవర్ ని వదిలేసి పారిపోయాడు ప్రేమికుడు. దీంతో మోసపోయానని గుర్తించిన ప్రేమికురాలు.. పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ కాలేజీలో(2019) బీఎడ్ చదివే సమయంలోనే అలోకం పవన్, ఎలి నాగేశ్వర రావు మధ్య ప్రేమ చిగురించింది. చదువు పూర్తయ్యాక కృష్ణలంకలో వీరిద్దరూ ట్యూషన్ పాయింట్ నడిపారు. 2019లో కృష్ణలంక సత్యం గారి హోటల్ సెంటర్ సమీపంలోని ఒక ఇంటిలో వీరిద్దరూ సహజీవనం చేశారు. ఇద్దరూ మగాళ్లమని యజమానికి చెప్పి.. పరిచయం చేసుకున్నారు. సుమారు ఆరు సంవత్సరాలుగా పవన్, నాగేశ్వర రావు సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకున్నారు. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లి ప్రియుడు నాగేశ్వర రావు పవన్ కు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించాడు. పవన్ ను భ్రమరాంబికగా మారడానికి రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయి.

అవయవ మార్పిడి ఆపరేషన్ కు అవసరమైన ఖర్చును మొత్తం పవనే భరించాడు. అలాగే నాగేశ్వరరావును నమ్మి అతనికి 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదు ఇచ్చాడు పవన్. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. పవన్ అలియాస్ భ్రమరాంబిక ఆపరేషన్ చేసిన ఏడాది తర్వాత నాగేశ్వర రావు అసలు రూపం బయట పడింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లికి నిరాకరించాడు నాగేశ్వర రావు. తనతో ఉండొద్దంటూ భ్రమరాంబికను ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న పవన్ అలియాస్ భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగేశ్వర రావు, అతని తల్లి విజయలక్ష్మిపై భ్రమరాంబిక ఫిర్యాదు చేసింది. భ్రమరాంబిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియుడు నాగేశ్వర రావు పరారీలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

#andhra-pradesh #vijayawada #strange-love-story #love-story
Advertisment
తాజా కథనాలు