Rains: వాయుగుండం ఆదివారం అర్థరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది.ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా , కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కాకినాడ, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉభయగోదావరి జిల్లాలు, వైఎస్‌ఆర్, చిత్తూరు, తిరుపతి, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు.