Indira Gandhi: రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు.. ఇందిరా కాలం నుంచే మొదలయ్యాయా? ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ పై రాయి దాడి హాట్ టాపిక్ గా మారింది. దాడి జరిగినా కూడా సీఎం జగన్ ప్రచారం ఆపలేదు. అయితే, ఇలాంటి ఘటనే 1967లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి జరిగింది. ముక్కు ఎముక విరిగినా ప్రసంగం ఆపలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Jyoshna Sappogula 15 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Indira Gandhi: ముక్కు ఎముక విరిగినా ప్రసంగం ఆపలేదు ఇందిరా గాంధీ. రాళ్లు మీద పడుతున్నా వెనక్కి తగ్గలేదు. ఇదంతా దాదాపు 50ఏళ్ల నాటి చరిత్ర. రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరగడం ఈనాటి విషయం కాదు.. 1967లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా గాంధీపై దండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆమె ముక్కు ఎముక విరిగిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? రాజకీయ నాయకులపై సభల్లో రాళ్లు విసరడం ఇందిరా కాలం నుంచే మొదలయ్యాయా లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం! చెరగని ముద్ర.. అది 1967, ఫిబ్రవరి 8.. ఒడిశా- భువనేశ్వర్‌లోని ఒక మైదానంలో కాంగ్రెస్ ఎన్నికల సమావేశం జరుగుతోంది. వేదికపై పలువురు నాయకులు ఉండగా, ఎదురుగా మద్దతుదారులు గుమిగూడారు. ఇందిర తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జరిగిన మీటింగ్ ఇది. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా ఇందిరాపై దుండగులు రాళ్లు విసిరారు. ఇందిర మాట్లాడుతుంటే రాళ్ల వర్షం కురిసింది. అందులో ఓ రాయి వచ్చి ఇందిర ముక్కుకు బలంగా తగిలింది. రక్తస్రావం మొదలైంది.. పై పెదవులు వాచాయి. అయినా ఇందిర ఆగలేదు. రాళ్ల వర్షం మధ్య ఇందిర 'దేశాన్ని ఇలాగే నిర్మిస్తావా? ఇలాంటి వారికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న నాయకులు ఇందిరను వేదికపై నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసినా ఆమె అంగీకరించలేదు. ఏ మాత్రం బెదరకుండా ముక్కుకు క్లాత్ చుట్టుకుని ప్రసంగం కొనసాగించారు. ఈ ఘటన దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది. Also Read: జగన్ పై దాడి.. అధికారులు అలా ఎందుకు చేయలేదు: పవన్ కల్యాణ్ ప్రశ్నలు దేశాన్ని కదిలించాయి.. ఇందిరా అక్కడితో ఆగలేదు. భువనేశ్వర్ నుంచి ముక్కుకు కట్టుకోని కోల్‌కతాకు వెళ్లారు. కోల్‌కతాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆస్పత్రికి వెళ్లారు. గాయం తీవ్రత కారణంగా ఇందిరా ముక్కుకు గాయానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె ముక్కుకు శస్త్రచికిత్స చేశారు. ఈ పరిణామాలు యావత్ దేశాన్ని కదిలించాయి. ఇందిరాపై దాడిని అన్ని పార్టీలు బహిరంగంగా ఖండించాయి. తొలిసారి కాదు.. ఎన్నికల ప్రచారంలో ఇందిరాపై దాడి జరగడం అది తొలిసారి కాదు. భువనేశ్వర్ ఘటనకు ముందు జైపూర్‌లో జరిగిన బహిరంగ సభలోనూ ఇందిరాకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జైపూర్‌లో ఆమె ప్రసంగిస్తున్నప్పుడు జనసంఘ్ మద్దతుదారుల ఆమెకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గోవధ నిషేధం అని గట్టిగా అరిచారు. ఆమె ప్రసంగానికి అనేకసార్లు అంతరాయం కలిగించారు. ఆ సమయంలో ఇందిరా వేదికపై నుంచి ఏ మాత్రం బెదరకుండా మాట్లాడారు. ఇలాంటి చర్యలకు భయపడనని.. ఈ మూర్ఖుల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని ఫైర్ అయ్యారు. దేశాన్ని విదేశీయులు పాలిస్తున్నప్పుడు జనసంఘ్ మద్దతుదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. #cm-jagan #indira-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి