చలికాలంలో కడుపు(Stomach) ఉబ్బరంగా ఉంటూ ఉంటుంది. కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉబ్బరాన్ని తగ్గించే కొన్ని మూలికల గురించి తెలుసుకుందాం.
అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి సరిగాలేకపోవడం ప్రజలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. చాలాసార్లు అతిగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, పుల్లని తేన్పులు వస్తుంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మందులు వేసుకుంటూ ఉంటాం. అయినా కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. సహజ మార్గంలో ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.
సెలెరీ
సెలెరీలో తగినంత మొత్తంలో పినేన్, లిమోనెన్, కార్వోన్ ఉంటాయి. గ్యాస్ ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఇది సహాయపడుతుంది. మీరు తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. మీరు సెలెరీ టీని తాగవచ్చు. దీన్ని తయారుచేయడానికి, ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో సెలెరీ ఆకు వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
సోంపు
అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు సర్వసాధారణం. దీనిని నివారించడానికి సోంపును వాడవచ్చు. ఇది యాంటిస్పాస్మోడిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఆహారం తిన్న తర్వాత సోపును నమలడం వల్ల కడుపుకు ఎంతో మేలు జరుగుతుంది.
అల్లం
పీరియడ్స్ సమయంలో స్త్రీలకు కడుపు ఉబ్బరం, యాసిడిటీ, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు ఉంటాయి. ఆహారంలో అల్లం ఎక్కువగా వాడితే ఈ సమస్యలు ఉండవు. అల్లం టీ కూడా ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. దీన్ని చేయడానికి నీటిని వేడి చేసి అందులో సన్నగా తరిగిన అల్లం వేసి మరిగించాలి. దీన్ని ఫిల్టర్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ఈ టీని ఎంజాయ్ చేయండి.
జీలకర్ర
జీలకర్రలో క్యూమినాల్డిహైడ్, టెర్పెనోయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్యాస్, కడుపు తిమ్మిరి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.
చామంతి టీ
చామంతి టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మీరు కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటే చామంతి టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
Also Read: ఆఫీసులో పొరపాటున ఇలా చేయకండి.. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు!
WATCH: