Stock Market Updates: వారం చివరి ట్రేడింగ్ రోజున అంటే ఈరోజు మార్చి 1న, స్టాక్ మార్కెట్ బుల్లిష్ పెరుగుదలను చూస్తోంది. సెన్సెక్స్ 73,574 వద్ద ఆల్ టైమ్ హైని, నిఫ్టీ 22,304 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. మధ్యాహ్నం 12:15 గంటలకు సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో 73,530 స్థాయి వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 300 పాయింట్లు పెరిగి, 22,290 స్థాయి వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 27 లాభాలను, 3 క్షీణతను కనబరుస్తున్నాయి. చమురు-గ్యాస్, బ్యాంకింగ్, ఆటో స్టాక్‌లలో అతిపెద్ద పెరుగుదల కనిపిస్తోంది.
Also Read: బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్..
నిఫ్టీ మెటల్ అత్యధికంగా 1.99% పెరిగింది
NSE సెక్టోరల్ ఇండెక్స్ చూస్తేకానుక.. నిఫ్టీ మెటల్ అత్యధికంగా 1.99% పెరిగింది. అదే సమయంలో, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 1.82%, నిఫ్టీ ఆటో 1.30%, నిఫ్టీ బ్యాంక్ 0.78%, నిఫ్టీ IT 0.15% చొప్పున పెరిగాయి. కాగా, నిఫ్టీ ఫార్మా 0.23%, నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.99% క్షీణించాయి.
నిన్న కూడా మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది
అంతకుముందు నిన్న అంటే ఫిబ్రవరి 29న స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 72,500 వద్ద ముగిసింది. నిఫ్టీలో కూడా 31 పాయింట్లు ఎగబాకాయి. 21,982 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభపడగా, 8 పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో ఎక్కువ లాభాలు కనిపించాయి. పేటీఎం షేర్లు 1.92 శాతం లాభపడ్డాయి.