Stock Market Today: షేర్ మార్కెట్ ఈరోజు అంటే గురువారం (మే 23) ఆల్ టైమ్ హైకి చేరుకుంది. సెన్సెక్స్ గరిష్టంగా 75,499కి చేరుకుంది. అంతకుముందు, ఏప్రిల్ 9న సెన్సెక్స్ గరిష్ట స్థాయి 75,124గా రికార్డ్ అయింది. నిఫ్టీ 22,993 స్థాయిని తాకింది. అంతకుముందు నిఫ్టీ గరిష్టం 22,794 వద్ద రికార్డ్ సృష్టించింది. .
అయితే ఎగువ స్థాయిల నుంచి మార్కెట్ స్వల్పంగా దిగజారడంతో సెన్సెక్స్ 1196 పాయింట్ల లాభంతో 75,418 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 354 పాయింట్లు పెరిగింది. 22,952 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 3 స్టాక్స్ మాత్రమే క్షీణించగా, 27 లాభపడ్డాయి.
ఈరోజు వ్యాపారంలో అతిపెద్ద పెరుగుదల బ్యాంకింగ్ - ఆటో స్టాక్‌లలో ఉంది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.25% లాభంతో, బ్యాంక్ ఇండెక్స్ సుమారు 2.06% లాభంతో ముగిశాయి. ఐటీ, రియాల్టీ సూచీలు 1% కంటే ఎక్కువ పెరిగాయి. ఫార్మాలో క్షీణత కనిపించింది. ఫార్మా ఇండెక్స్ -0.52% డౌన్ లో ముగిసింది.
Also Read: ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బే.. డబ్బు.. ఎందుకు.. ఎలా వచ్చింది?
Stock Market Today: స్టాక్ మార్కెట్ పెరుగుదలకు 4 కారణాలు
- జూన్ 4న భాజపా రికార్డు స్థాయికి చేరిన వెంటనే స్టాక్ మార్కెట్ కూడా సరికొత్త రికార్డులకు చేరుకుంటుందని విశ్వాసంతో చెప్పగలను అని ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రకటన సానుకూల ప్రభావం మార్కెట్లో కనిపిస్తుంది.
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) విక్రయదారులుగా మిగిలిపోయారు, అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తున్నారు. NSEలో అందుబాటులో ఉన్న మధ్యంతర డేటా ప్రకారం, మే 22, 2024న, FIIలు రూ. 686.04 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, DIIలు రూ. 961.91 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
- LT, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ షేర్ల పెరుగుదల కారణంగా సెన్సెక్స్ పెరిగింది. ఎల్‌టి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు దాదాపు 3% లాభంతో ముగిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు దాదాపు 2% పెరిగాయి.
- 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2,10,874 కోట్ల మిగులు బదిలీని ఆర్‌బీఐ బోర్డు ఆమోదించింది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ రూ. 87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. అంటే గతేడాది కంటే ఇది రూ.1.23 లక్షల కోట్లు ఎక్కువ.
Stock Market Today: గో డిజిట్ షేర్లు 5% పెరిగి రూ. 286 వద్ద ఉన్నాయి. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు ఎన్‌ఎస్‌ఇలో 5.15% పెరిగి రూ.286 వద్ద లిస్ట్ అయ్యాయి. బిఎస్‌ఇలో 3.35 శాతం పెరిగి రూ.281.10 వద్ద లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.272.
నిన్న అంటే బుధవారం (మే 22) కూడా స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 74,221 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68 పాయింట్లు పెరిగింది. 22,597 వద్ద ముగిసింది.