Stock Market Today: స్టాక్ మార్కెట్ దూకుడు తగ్గలేదు. ఈరోజు అంటే గురువారం (డిసెంబర్ 28) సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ 72,406.. నిఫ్టీ 21,759 ను తాకాయి. అంతకుముందు సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 72,262 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీలో కూడా 61 పాయింట్లు పెరిగి 21,715 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 26 పెరుగుదలను చూపుతున్నాయి మరియు 4 మాత్రమే క్షీణతను చూపుతున్నాయి. పవర్ మరియు బ్యాంకింగ్ షేర్లలో మరింత పెరుగుదల ఉంది.
Stock Market Today: స్టాక్ మార్కెట్ దూకుడుగా ఉన్న వేళలో ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అనే అనుమానాలు ప్రతి ఇన్వెస్టర్ కీ ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తసంవత్సరం ప్రారంభంలో కూడా స్టాక్ మార్కెట్ పరుగులు తీయడం ఖాయం అని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు కొద్దిగా వేచి చూస్తే మంచిదని చెబుతున్నారు. ఇక రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారు.. ఇప్పటికే ట్రేడింగ్ చేస్తున్న వారు.. ఎటువంటి స్టాక్స్ కొనవచ్చు అనే అంచనాను నిపుణులు ఇచ్చారు. వివిధ ఫైనాన్షియల్ సమాచారాన్నిచ్చే వెబ్సైట్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్, స్టాక్ బ్రోకర్లు ఈరోజు ఎటువంటి షేర్లను రికమండ్ చేస్తున్నారో తెలుసుకుందాం.
బిజినెస్ లైన్ వెబ్సైట్ ప్రకారం..
Stock Market Today: సెంచరీ ప్లే బోర్డ్స్, JSW ఎనర్జీ, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, కేమ్ప్లాస్ట్ సన్మర్, అద్వైత్ ఇన్ఫ్రాటెక్, టాటా మోటార్స్ షేర్లను కొనవచ్చు.
Also Read: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు?
5 Paisa వెబ్సైట్ ప్రకారం
Stock Market Today: గ్రీన్ ప్లే, జేకే పేపర్, వెల్ కార్ప్, భారతీ ఎయిర్ టెల్, సోనాకామ్స్ షేర్లను పరిశీలించవచ్చు.
ఇక స్టాక్ బ్రోకర్ల రికమండేషన్స్ చూద్దాం..
మోతీలాల్ ఓస్వాల్: కోల్ ఇండియా, న్యూట్రల్ బార్బెక్యూ
షేర్ ఖాన్: KEI ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మాస్టెక్, అశోక్ లేలాండ్, చోళ మండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ
ప్రభుదాస్ లీలాధర్: RR కాబిల్, జియోజిత్: బాటా ఇండియా
Stock Market Today: ఇవన్నీ ఈరోజు ట్రేడింగ్ లో కొనవచ్చని చెబుతున్న కొన్ని షేర్లు.
గమనిక: ఈ ఆర్టికల్ కేవలం ఇన్వెస్టర్స్ ప్రాథమిక అవగాహన కోసం ఇచ్చినది. ఏదైనా కంపెనీ షేర్లను కొనమని కానీ,అమ్మమని కానీ ఈ ఆర్టికల్ రికమండ్ చేయడం లేదు. ఇక్కడ ఇచ్చిన రికమండేషన్స్ ఆయా సంస్థలు, నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయలు మాత్రమే. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అస్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకుని, మీ ఆర్థిక సలహాదారుని సూచనల మేరకు చేయాల్సిందిగా సూచిస్తున్నాం.
Watch this interesting Video: