Stock Market: స్టాక్ మార్కెట్ పరుగులు కొనసాగుతాయా? ఈ వారం మార్కెట్ పై  ప్రభావం చూపే అంశాలివే!

స్టాక్ మార్కెట్ గత వారంలో కాస్త పెరుగుదల కనబరిచింది. అయితే, వారం చివరి రోజు అంటే శుక్రవారం కొద్దిగా క్షీణించింది. ఈ వారంలో FOMC మినిట్స్ వచ్చే అవకాశం ఉండడం.. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు వంటివి ఈ వారం మార్కెట్ పై ప్రభావం చూపిస్తాయి. 

New Update
Disaster Recovery : సెలవు రోజు అయినా ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.. ఎందుకంటే.. 

Stock Market: గత వారంలో స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలను చూపించింది. అదే ధోరణి ఈవారం కూడా కొనసాగవచ్చని నిపుణుల అంచనా. జీడీపీపై వినిపిస్తున్న సానుకూల వార్తలు.. మార్కెట్ FOMC మినిట్స్ అంటే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ మీటింగ్స్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ డేటా, డొమెస్టిక్ ఎకనామిక్ డేటా, FII-ఫ్లో, క్రూడ్ ఆయిల్ ధర - రాబోయే IPOల నేపథ్యంలో మార్కెట్ లో పెరుగుదల ఊహిస్తున్నారు.  నవంబర్ 20వ తేదీ అంటే సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారంలో మార్కెట్ కదలికను నిర్ణయించే అంశాల గురించి చూద్దాం.. 

FOMC మినిట్స్
గ్లోబల్ మార్కెట్లు నవంబర్ 1న ముగిసిన ద్రవ్య విధాన సమావేశం FOMC మినిట్స్ పరిస్థితిని గమనిస్తాయి.  ప్రపంచ పెట్టుబడిదారులు-ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా వడ్డీ రేట్ల పెరుగుదల ఆగుతుందని.. మరిన్ని మంచి సంకేతాలు FOMC మినిట్స్ ఇస్తుందని ఆశిస్తున్నారు.

US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని 2% లక్ష్యానికి తీసుకురావడం, గరిష్ట ఉపాధిని నమోదు చేయడం -మాంద్యం నివారించడం లేదా US ఆర్థిక వ్యవస్థకు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం వెతకడం వంటి కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి సారిస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే మితిమీరిన పాలసీ కఠినతను నివారించాలని ఫెడ్ కోరుతోంది. US ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3.7%తో పోలిస్తే అక్టోబర్‌లో 3.2%కి వచ్చింది. దీంతో గత వారం ఈక్విటీ మార్కెట్లు(Stock Market) పుంజుకున్నాయి.

గ్లోబల్ ఎకనామిక్ డేటా
FOMC మినిట్స్ తో పాటు, నవంబర్‌లో మాన్యుఫాక్చర్ - సర్వీసెస్ PMI డేటా, అక్టోబర్‌లో జపాన్ ద్రవ్యోల్బణం -US ఉద్యోగాల డేటా కూడా ప్రభావం చూపిస్తుంది. 

ముడి చమురు ధర:
పెట్టుబడిదారులు ముడి చమురు ధరల వైపు కూడా చూస్తూ ఉంటారు. దిగుమతులు ఎక్కువగా చేసుకునే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ముడి చమురు ధరలు అతిపెద్ద ప్రమాదం తెచ్చిపెడతాయి.  డిమాండ్, US క్రూడ్ ఇన్వెంటరీలలో భారీ పెరుగుదల -పెరుగుతున్న నాన్-OPEC సరఫరా కారణంగా చమురు ధరలు తగ్గుతున్నాయి.

Also Read: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా?

చమురు ధరలకు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ గత వారం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ధరలు వారానికి 1% పడిపోయి బ్యారెల్‌కి $80.61కి పడిపోయాయి.  ఇది జూలై రెండవ వారం నుంచి కనిష్ట ముగింపు స్థాయి. చమురు ధరలు అక్టోబర్ గరిష్టం ($92.38) నుంచి దాదాపు 13% తగ్గాయి.

ఎఫ్‌ఐఐ-ఫ్లోలు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) విక్రయాలు తగ్గడం -ఫెడ్ రేట్ల పెంపు చక్రాన్ని పూర్తి చేసిందన్న అంచనాలు పెరగడం కూడా ఈక్విటీ మార్కెట్(Stock Market) సెంటిమెంట్‌ను పెంచింది. యుఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గిన తర్వాత ఎఫ్‌ఐఐల విక్రయాలు తగ్గాయి. కానీ బలమైన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల (DII) డేటా మార్కెట్‌పై ఎఫ్‌ఐఐ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.

రెండు రోజుల కొనుగోళ్ల కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత వారంలో నికర రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  అయితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు దీనిని పూర్తిగా ఆఫ్‌సెట్ చేశారు. వారంలో రూ.1,580 కోట్ల విలువైన షేర్లను వారు కొనుగోలు చేశారు.

నవంబర్‌లో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ.6,575 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, నగదు విభాగంలో డీఐఐలు రూ.7,700 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. బాండ్ ఈల్డ్‌ల గురించి చూస్తే కనుక, శుక్రవారం US 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ వారం-ఆన్-వీక్ ప్రాతిపదికన 4.64% నుంచి 4.44% వద్ద ముగిసింది. ఇదే సమయంలో అమెరికా డాలర్ ఇండెక్స్ 105.86 నుంచి 103.82కి పడిపోయింది.

డొమెస్టిక్ ఎకనామిక్ డేటా
మరోవైపు దేశీయ ఆర్థిక డేటా చూస్తే, నవంబర్ 17తో ముగిసే వారానికి విదేశీ మారక నిల్వల డేటా వచ్చే వారం నవంబర్ 24న వెల్లడికానుంది. ఇది తప్ప, ఇతర ప్రత్యేక కార్యాచరణ ఉండదు.

ప్రైమరీ మార్కెట్‌

మార్కెట్(Stock Market) ప్రైమరీ మార్కెట్‌పై కూడా కన్నేసి ఉంచుతుంది.  ఎందుకంటే వచ్చే వారం ఆరు కంపెనీలు రూ. 7,400 కోట్ల విలువైన IPOలను ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ IPO నవంబర్ 21న ప్రారంభం కానుంది. ఇది రూ.2,150 కోట్ల ఇష్యూ. ఇది నవంబర్ 23న ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 30-32.

మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్‌లో, టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ -ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ నుంచి IPOలు ఉన్నాయి. ఈ ఇష్యూలన్నీ నవంబర్ 22న ఓపెన్ అవుతాయి  - నవంబర్ 24న ముగుస్తాయి.

టాటా టెక్నాలజీస్ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 475-500 -ఇష్యూ నుంచి కంపెనీ రూ. 3,042.51 కోట్లను సమీకరించనుంది. కాగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ నుంచి రూ.500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 160-169.

NBFC ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO నుంచి రూ. 1,092.26 కోట్లను సమీకరించనుంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133-140. అయితే ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ తన IPO నుంచి రూ. 593 కోట్లను సమీకరించాలనుకుంటోంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.288-304.

SME విభాగంలో, B2B రీ-కామర్స్ కంపెనీ రాకింగ్ డీల్స్ సర్క్యులర్ ఎకానమీ తన రూ. 21 కోట్ల పబ్లిక్ ఇష్యూని నవంబర్ 22-24 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవనుంది. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.136-140గా ఉంటుంది.

అయితే యారో హెడ్ సెపరేషన్ ఇంజినీరింగ్ IPO నవంబర్ 20న ముగుస్తుంది. లిస్టింగ్ గురించి మాట్లాడితే, హెల్త్‌కేర్ -పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సప్లయర్ సన్‌రెస్ట్ లైఫ్‌సైన్స్ షేర్లు నవంబర్ 20న NSE ఎమర్జ్‌లో లిస్ట్ అవుతాయి. 

గత వారం మార్కెట్‌లో పెరుగుదల.. 

గత వారం మొత్తం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1.37% పెరిగింది. నిఫ్టీ కూడా 1.58 శాతం పెరిగింది. అయితే, చివరి ట్రేడింగ్ వారం చివరి రోజు అంటే శుక్రవారం (నవంబర్ 17) స్టాక్ మార్కెట్‌లో తగ్గుదల కనిపించింది. సెన్సెక్స్ 187 పాయింట్ల పతనంతో 65,794 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 33 పాయింట్లు పతనమై 19,731 వద్ద ముగిసింది.

గమనిక: ఈ ఆర్టికల్ ఇన్వెస్టర్స్ ప్రాథమిక అవగాహన కోసం ఇచ్చింది మాత్రమే. ఫలానా స్టాక్స్ కొనమని గానీ.. అమ్మకం జరిపాలని కానీ ఈ ఆర్టికల్ రికమండ్ చేయడం లేదు. వివిధ సందర్భాల్లో నిపుణులు ఇచ్చిన అంచనాలు, మార్కెట్ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టేముందు అన్ని అంశాలను చెక్ చేసుకోవాలి. అలాగే, ఆర్ధిక సలహాదారుల సూచనలు తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు