Stock Market Record: స్టాక్ మార్కెట్ జోరు.. ఇది దూకుడు కాదు అంతకు మించి.. నిన్న (డిసెంబర్ 28) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగింది. 72,410 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 21,777 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా 6 మాత్రమే పతనమయ్యాయి. By KVD Varma 29 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market Record: మన డబ్బును మరింత పెంచాలంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఈ కారణంతోనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అయితే, స్టాక్ మార్కెట్ అనేది పూర్తి అస్థిరత తో ఉండే ప్రదేశం. ఒక్క నిమిషంలో మన డబ్బు డబుల్ అయిపోవచ్చు.. మరో నిమిషంలోనే ఒక్క రూపాయి మిగలకుండా ఊడ్చుకుపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.. జాగ్రత్తగా ఆచి తూచి.. నిపుణుల సలహాలు తీసుకుని.. కొంత రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది. అందుకే, ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Stock Market Record) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అందుకే అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే గురువారం నాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం. Stock Market Record: నిన్న (డిసెంబర్ 28) స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు నెలకొల్పింది. స్టాక్ మార్కెట్ గురువారం (డిసెంబర్ 28) సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. నిన్న ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 72,484 స్థాయిని, నిఫ్టీ 21,801 జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. అయితే దీని తర్వాత స్వల్ప క్షీణతతో నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 21,777 వద్ద మార్కెట్ ముగిసింది. అదే సమయంలో, సెన్సెక్స్(Stock Market Record) 372 పాయింట్లు పెరిగింది. 72,410 వద్ద ముగిసింది. గురువారం సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా 6 మాత్రమే పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో షేర్లు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, తరువాత తిరిగి పుంజుకున్నాయి. Also Read: తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్ దూకుడు.. నిపుణులు రికమండ్ చేస్తున్న షేర్లు ఇవే! Stock Market Record: వచ్చే ఏడాది ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనే అంచానాలు దేశీయంగా స్టాక్ మార్కెట్ పరుగులకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఎనర్జీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు విపరీతంగా రాణించాయి. దీంతో సెన్సెక్స్ ఒక్కసారిగా పైకెగసింది. 446 పాయింట్లు లాభపడి 72,484 వద్దకు చేరుకొని ఆల్ టైమ్ రికార్డ్(Stock Market Record) సృష్టించింది. మరోవైపు నిఫ్టీ కూడా 147 పాయింట్లు బలపడింది. దీంతో 21,081 పాయింట్లతో రికార్డ్ నమోదు చేసింది. బీఎస్‌ఈ మిడ్ ఇండెక్స్ 0.66%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23% చొప్పున లాభపడ్డాయి. మొత్తంగా చూసుకుంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ 4,359 కోట్ల రూపాయల షేర్లను కొనగా.. సంస్థాగత ఇన్వెస్టర్స్ 137 కోట్ల రూపాయల షేర్లను కొన్నారు. Stock Market Record: గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 1,904 పాయింట్లు లాభపడింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 12.80 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 363 లక్షల కోట్లకు చేరుకొని లైఫ్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. గురువారం ఒక్కరోజే ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ 1.7 లక్షల కోట్లను పెంచుకోవడం గమనార్హం. Stock Market Record: జొమాటోకు జీఎస్టీ నోటీసుల దెబ్బ తగిలింది. డెలివరీ ఫీజులపై జీఎస్టీ 402 కోట్ల రూపాయలు బకాయి ఉందని డీజీజీఐ జొమాటోకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీంతో జొమాటో షేర్లు 3శాతం నష్టపోయాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో షేర్లు 12శాతం పెరిగాయి. గుజరాత్ ప్రభుత్వంతో హౌసింగ్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌కు సంబంధించి హడ్కో 14,500 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో హడ్కో షేర్లు పరుగులు తీశాయి. నిఫ్టీ50 లో టాప్ 5 గెయినర్స్: Coal India - 4.21%, NTPC 3.07%, M&M 2.79%, Hero Moto corp 2.60% నిఫ్టీ50 లో టాప్ 5 లూజర్స్: Adani Ent: -0.93%, LT: -0.59%, Eicher Mot: -0.59%, LTIM: -0.53% Watch this interesting Video: #stock-market-news #stock-markets-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి