Stock Market Loss: స్టాక్ మార్కెట్లో నష్టాలు.. ఇన్వెస్టర్స్ ఇలా చేస్తే సేఫ్! స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా నష్టాల బాటలోకి వెళ్ళింది. దీంతో ఇన్వెస్టర్స్ అయోమయంలో పడిపోయారు. నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఉన్నపుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా నిపుణులు ఏడు రకాల సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 10 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market Loss: స్టాక్ మార్కెట్‌లో నిన్న అంటే మే 9న 1062 పాయింట్ల (1.45%) క్షీణత కనిపించింది. గత 5 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ మార్కెట్ దాదాపు 3.5% క్షీణించింది. ఈ తగ్గుదల ఇన్వెస్టర్లలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే, భయపడనవసరం లేదనీ, సరైన వ్యూహం ఈ పతనంలో మంచి డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడుతుందనీ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పడిపోతున్న మార్కెట్‌లో ఇన్వెస్టర్స్ డబ్బు సంపాదించగలిగే.. నష్టపోకుండా ఉండగలిగే 7 విషయాలను చెబుతున్నారు. అవేమిటంటే.. క్రమశిక్షణను కొనసాగించండి Stock Market Loss: మీ పోర్ట్‌ఫోలియోలో నాటకీయ మార్పులు అంటే ఇష్టం వచ్చినట్టు మారుస్తూ పోవడం వలన ప్రమాదాలు పెరుగుతాయి. అలాంటి అలవాటు దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మార్కెట్‌లో తక్షణ ఒడిదుడుకులను పట్టించుకోకుండా క్రమశిక్షణను పాటిస్తే మంచిది. పోర్ట్‌ఫోలియోలో మార్పులు అవసరమని భావిస్తే చిన్న మార్పులకే పరిమితం అవ్వండి. Also Read: ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం.. SIP ద్వారా పెట్టుబడి.. Stock Market Loss: స్టాక్ మార్కెట్ దాని ఎగువ స్థాయిల నుండి 3% కంటే ఎక్కువ పడిపోయింది. అయితే, ఇన్వెస్టర్స్ ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకుంటే, వారు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా వాయిదాలలో (SIP) చేయాలి. ఇది స్టాక్ మార్కెట్ సంబంధిత హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. కాస్త ఓపిక పట్టడం ద్వారా పడిపోతున్న మార్కెట్‌లో కూడా లాభాలను ఆర్జించవచ్చు. పెట్టుబడులను ట్రాక్ చేస్తూ ఉండండి Stock Market Loss: మీరు వివిధ రకాల ఎస్సెట్స్ లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు అన్ని పెట్టుబడులను క్రమం తప్పకుండా ట్రాక్ చేయలేకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మారుతున్న మార్కెట్ పోకడలకు ఖచ్చితంగా స్పందించడం కష్టం. కాబట్టి మీరు మీ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతే, విశ్వసనీయ ఆర్థిక సలహాదారుని సహాయం తీసుకోండి. షేర్లను నష్టాల్లో విక్రయించవద్దు.. Stock Market Loss: స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేసి, అందులో నష్టపోయినప్పటికీ, మీరు మీ షేర్లను నష్టానికి విక్రయించకుండా ఉండాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మీరు మీ షేర్లను ఎక్కువ కాలం ఉంచినట్లయితే, మీ నష్టానికి అవకాశాలు తగ్గుతాయి. స్టాక్ బాస్కెట్ ఈమధ్య కాలంలో స్టాక్ బాస్కెట్ అనే భావన కొనసాగుతోంది. దీని కింద, మీరు షేర్ల బుట్టను తయారు చేసి, మీ అన్ని షేర్లలో పెట్టుబడి పెట్టండి. అంటే ఈ 5 షేర్లలో మొత్తం రూ.25 వేలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక్కో దానిలో రూ.5-5 వేలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ప్రమాదాన్నిఅలాగే రిస్క్ ని తగ్గిస్తుంది. #stock-market #stock-market-trends మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి