Stock Market Holidays: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి నెల, ఏప్రిల్ ముగియబోతోంది. దీంతో మే నెల ప్రారంభం అవుతోంది. మేలో మొత్తం 10 రోజుల పాటు స్టాక్ మార్కెట్లు క్లోజ్ అవుతాయి. దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం, మే 1న క్లోజ్ (Stock Market Holidays)అవుతుంది. అంటే ఈ రోజు మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. వాస్తవానికి, మే 1 మహారాష్ట్ర దినోత్సవం. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ప్రభుత్వ సెలవుదినం. భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు - BSE - NSE ముంబైలో ఉన్నాయి. మహారాష్ట్రలో సెలవు కారణంగా మే 1న రెండు ఎక్స్ఛేంజీలకు సెలవు.
మే 1వ తేదీన..
మే నెలలో 10 రోజుల పాటు స్టాక్ మార్కెట్లు తెరచుకోవు. మహారాష్ట్ర దినోత్సవం కారణంగా ఈ నెల ఒకటో తేదీన మార్కెట్‌లో(Stock Market Holidays) ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. మే 1న మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పాటైంది. మహారాష్ట్ర 1 మే 1960 నుండి కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది. అందువల్ల ప్రతి సంవత్సరం మే 1ని మహారాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు స్టాక్ మార్కెట్‌తో పాటు, బ్యాంకులకు కూడా సెలవు రోజు.
ఓటింగ్ రోజు ఎలాంటి ట్రేడింగ్ ఉండదు..
మహారాష్ట్ర డే కాకుండా, మే 20, సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెలవు(Stock Market Holidays) ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ రెండో సెలవు వస్తోంది. వాస్తవానికి ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు మే 20న ఓటింగ్ జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదవ దశ సార్వత్రిక ఎన్నికల కింద మే 20న ముంబైలో ఓటింగ్ జరగనుంది. అందువల్ల ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు.
Also Read: బాబా రామ్‌దేవ్ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్!
మే నెలలో 10 రోజుల సెలవులు..
మే నెలలో స్టాక్ మార్కెట్లు 10 రోజులకు సెలవులు(Stock Market Holidays) ఉంటాయి. వాస్తవానికి, సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి వారం ఐదు రోజుల పాటు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ జరుగుతుంది. ప్రతి వారం వారాంతాల్లో అంటే శనివారం - ఆదివారం స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. అంటే ఒక నెలలో మొత్తం వారాంతపు సెలవులు 8. వారాంతపు సెలవులను కలుపుకుంటే, మే నెలలో 8 వారాంతాలు అలాగే పైన చెప్పుకున్న 2 సాధారణ సెలవులు సహా మొత్తం 10 రోజుల పాటు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు. మేలో, శనివారాల కారణంగా, మే 4, 11 మే, 18 - 25 తేదీలలో మార్కెట్ మూసివేస్తారు. ఆదివారాల కారణంగా మే 5, 12 మే, 19 - 26 తేదీలలో మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు.