Prithvi : ఐపీఎల్(IPL) లో వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన ఘనత సాధించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కటంలేదు. ఐపీఎల్ 2024(IPL 2024) లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో నిన్నజరిగిన మ్యాచ్ లో కూడా అతనకి జట్టు స్థానం దక్కలేదు. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో పాటు కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పృథ్వీ షా(Prithvi Shaw) ను ప్లేయింగ్ ఎలెవన్‌లో నే కాకుండా మ్యాచ్ మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా వచ్చిన 5 మంది సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌లలోను అవకాశం రావటం లేదు. 2018 నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న పృథ్వీని ఫ్రాంచైజీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతుడైన ఆటగాడిగా అభివర్ణించింది. కానీ ఇవాళ బెంచ్ వేడెక్కిస్తున్నాడు.
2019 నుంచి 2021 వరకు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా , శిఖర్ ధావన్‌ల జోడీ చాలా విజయవంతమైంది. 2022 మెగా వేలం తర్వాత, అతను డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్ ప్రారంభించాడు. ప్రారంభంలో వీరిద్దరు చాలా బలంగా కనిపించింది. కానీ నేడు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవాలని తహతహలాడే పరిస్థితి నెలకొంది. మోకాలి గాయం కారణంగా షా గత 5 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న అతను ఇటీవలే రంజీ ట్రోఫీలో ముంబై తరఫున చివరి 5 మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత సీజన్‌ను మిచెల్ మార్ష్ మరియు డేవిడ్ వార్నర్‌లతో ప్రారంభించబోతోంది. రికీ భుయ్, పృథ్వీ షాల మధ్య ప్రత్యక్ష పోటీ లేదని టీమిండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పూర్తిగా కొట్టిపారేశాడు.
Also Read : రోహిత్, పాండ్యాతో ఫొటో దిగిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు? భలే క్యూట్‌గా ఉందిగా!
సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, 'పృథ్వీ షా ఓపెనర్. ఓపెనింగ్‌లో మార్ష్, వార్నర్‌లను పంపాలని నిర్ణయించుకున్నాం. రికీ భుయ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అతను వివిధ బ్యాటింగ్ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు. అందువల్ల పృథ్వీ, భుయ్ మధ్య పోటీ లేదు. ఇది భిన్నమైన ఓపెనింగ్ జోడి. ఆస్ట్రేలియాకు మార్ష్, వార్నర్ ఓపెనర్లు. మరియు ఇద్దరూ తమ జాతీయ జట్టు కోసం బాగా రాణించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.
24 ఏళ్ల పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 71 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 1694 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023లో పృథ్వీ 8 మ్యాచ్‌ల్లో 106 పరుగులు చేశాడు. సీజన్ మధ్యలో అతన్ని ప్లేయింగ్ లెవన్ నుంచి తొలగించవలసి వచ్చింది. ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ మావి వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 6 ఫోర్లు కొట్టి షా అజింక్య రహానే ఫీట్‌ను పునరావృతం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో వరుసగా 6 ఫోర్లు బాదిన రికార్డు ఇద్దరు భారతీయుల పేరిట ఉంది.