/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-7-2-jpg.webp)
South Korea: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టార్ పాప్ సింగర్ పార్క్ బొ రామ్ (30) హఠాన్మరణం చెందారు. ఏప్రిల్ 11 అర్ధరాత్రి పార్క్ బొ రామ్ కన్నుమూసిందని, ఈ దుర్వార్త తెలిపేందుకు చింతిస్తున్నామని సింగర్ టీమ్ వెల్లడించింది. ఇక మరణానికి కొద్ది గంటల ముందు ఈవెంట్‌కు హాజరై.. స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు తెలిపారు.
Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc
— Kpop Charts (@kchartsmaster) April 11, 2024
రెస్ట్ రూంకు వెళ్లి తిరిగిరాలేదు..
ఈ మేరకు పార్క్ బొ రామ్ గురువారం రాత్రి 9.55 గంటలకు రెస్ట్ రూంకు వెళ్లి ఎంతకు తిరిగిరాకపోవడంతో వెళ్లి చూడగా సింక్‌పై అపస్మారక స్ధితిలో పడివున్నట్లు స్నేహితులు వెల్లడించారు. ఇక పార్క్ బొ రామ్ 17 ఏండ్ల వయసులోనే 2010లో సూపర్ స్టార్ కే2 పాటల పోటీలో తన టాలెంట్‌తో పాపులర్ అయింది. 2014లో తన సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్‌తో పాప్ మ్యూజిక్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసకుంది పార్క్. ఆమె మరణవార్త విన్న ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చూకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.