ఆమె ప్రవర్తనతో ఇబ్బంది పడిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిచయం కాకుండా, దేశవ్యాప్తంగా పాపులరైన హీరో. కథ బాగుంటే చాలు, ఏ భాషలోనైనా, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడడు ఈ నటుడు. By Karthik 20 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి దుల్కర్ సల్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిచయం కాకుండా, దేశవ్యాప్తంగా పాపులరైన హీరో. కథ బాగుంటే చాలు, ఏ భాషలోనైనా, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడడు ఈ నటుడు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోథ. ఈ సినిమా మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు దుల్కర్. దుల్కర్ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా ఓకే బంగారం, సీతారామం సినిమాల తర్వాత ఇతడికి లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అప్పటివరకు అబ్బాయిల్లో మాత్రమే ఇతడికి క్రేజ్ ఉండేది. పైన చెప్పుకున్న రెండు సినిమాల తర్వాత దుల్కర్ కు మహిళాభిమానులు కూడా ఎక్కువయ్యారు. ఈ క్రమంలో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడట దుల్కర్. కొంతమంది మహిళలు సెల్ఫీల కోసం తన దగ్గరకొచ్చి బుగ్గలపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించేవారని చెప్పుకొచ్చాడు దుల్కర్. అలాంటి చర్యల్ని తను వెంటనే సున్నితంగా తిరస్కరించేవాడినని, కానీ ఊహించని విధంగా జరిగిన ఓ ఘటన మాత్రం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంగా దుల్కర్ ను పలకరించడానికి ఓ పెద్దావిడ అతడి దగ్గరకు వచ్చిందట. ఫొటో కోసం వచ్చిందేమో అని దుల్కర్ కూడా రెడీ అవుతున్నాడట. అంతలోనే ఆవిడ, దుల్కర్ ను అసభ్యకరంగా తాకిందంట. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడట దుల్కర్. ఆ టైమ్ లో తనకు ఏం చేయాలో తెలియలేదని, చాలా ఇబ్బంది పడ్డానని అన్నాడు దుల్కర్. ఆ ఘటన వల్ల తను చాలా బాధపడ్డానని, ఆ తర్వాత నుంచి మహిళాభిమానులు తన దగ్గరకు వచ్చేటప్పుడు వీలైనంత దూరం పాటించడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఈ హీరోకు ఆల్రెడీ పెళ్లయింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే పెళ్లి చేసుకున్నాడు దుల్కర్. 28 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈ నటుడు, పెళ్లయిన తర్వాత నటుడిగా తన రెండో సినిమాను స్టార్ట్ చేశాడు. అప్పట్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రస్తుతం జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కింగ్ ఆఫ్ కోథతో తనకు మరో సక్సెస్ గ్యారెంటీ అంటున్నాడు ఈ హీరో #dulquer-salmaan #king-of-kotha #telugu-movies #movie-actor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి