Shiva Rajkumar: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చికిత్స..!

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం అనారోగ్యంగా ఉండడంతో బెంగళూరులోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం శివరాజ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. త్వరలోనే డిశ్చార్జ్‌ కానున్నట్లు తెలుస్తోంది. 

New Update
Shiva Rajkumar: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చికిత్స..!

Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన .. శివమొగ్గ నియోజక వర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సతీమణి గీతా శివరాజ్‌ కుమార్‌ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read: Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో!

publive-image

అస్వస్థతకు గురైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 

ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం అనారోగ్యంగా ఉండడంతో బెంగళూరులోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ తీసుకెళ్లారు. ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్‌ అయినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత మరో సారి రెగ్యులర్ చెకప్ కోసమని ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. వైద్యుల సలహా మేరకు మళ్ళీ అడ్మిట్ అయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వైద్యులు అందించిన సమాచారం ప్రకారం.. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని .. త్వరలోనే  డిశ్చార్జ్  అవుతారని తెలుస్తోంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు క్షేమంగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Priyanka Jain : సారీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము.. వైరలవుతున్న ప్రియాంక జైన్ పోస్ట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు