మీరు సినిమాల్లోనే హీరో.. రాజకీయాల్లో జీరో!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నేతల మాటల మంటలను రేకెత్తిస్తోంది. పవన్ కాకినాడ బహిరంగ సభలో ఎమ్మెల్యే ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు.. ఆరోపణలపై మాజీమంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

New Update
మీరు సినిమాల్లోనే హీరో.. రాజకీయాల్లో జీరో!

Stamped letter circulating in Kakinada

కాకరేపుతున్న ముద్రగడ లేఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కాపు నేత ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. ఇటీవల పవన్‌ను విమర్శిస్తూ ఆయన రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై జనసేన నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయనప్పటికీ ఏ మాత్రం తగ్గని ముద్రగడ ఈరోజు పవన్‌కు సవాల్ విసురుతూ మరో ఘాటు లేఖను సంధించారు.

తాను ఎప్పుడూ మీ గురించి ప్రతికలలో ఒక స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదని…కానీ, కాకినాడ ఎమ్మెల్యేతో పాటు తనను తిట్టడం తప్పో, రైటో మీరే గ్రహించుకోవాని ముద్రగడ అన్నారు. మీ అభిమానుల చేత బండ బూతులతో తనకు మెసేజులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మెసేజులకు భయపడి తాను లొంగడమనేది జన్మలో జరగని పని అని చెప్పారు. తనను తిట్టాల్సిన అవసరం మీకు గానీ, మీ అభిమానులకు గానీ ఏమొచ్చిందని ప్రశ్నించారు.

గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది? నేనేమీ మీకు బానిసను కాను. నా శ్రీమతి మంగళసూత్రం తెంపి.. లంజా రావే అని పోలీసులు బూటు కాలితో తన్నినప్పుడు మీరు అడగలేదే? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు