Jobs: SSC నుంచి మరో నోటిఫికేషన్‌ అవుట్.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి!

ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌తో సహా వివిధ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ssc.nic.in లో సబ్మిట్ చేయవచ్చు.

New Update
Jobs: SSC నుంచి మరో నోటిఫికేషన్‌ అవుట్.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి!

SSC JHT 2023 notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 12తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌ (ssc.nic.in) నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 307 పోస్టులను భర్తీ చేస్తుంది. ముఖ్యమైన తేదీలు, ఖాళీ వివరాలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలను చెక్‌ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 22
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 12
కరెక్షన్‌ విండో: సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 14, 2023 వరకు
పేపర్-1 పరీక్ష: అక్టోబర్ 2023

ఖాళీ వివరాలు:

➼ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 21 పోస్టులు

➼ జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 13 పోస్టులు

➼ జూనియర్ ట్రాన్స్‌లేటర్: 263 పోస్టులు

➼ సీనియర్ ట్రాన్స్‌లేటర్: ఒక పోస్ట్

➼ సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌: 9 పోస్టులు

ఫీజ్‌:
దరఖాస్తు రుసుము రూ.100. రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), PwBD, మాజీ సైనికులకు చెందిన మహిళా అభ్యర్థులుకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. BHIM UPI, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ చెల్లింపు మోడ్‌ల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?
• SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి click here

• దరఖాస్తు(Application)పై క్లిక్ చేయండి

• ఇది మిమ్మల్ని కొత్త విండోకు తీసుకెళ్తుంది, ఇక్కడ మీరు 'SSC JHT'ని సెలక్ట్ చేసుకోవాలి.

• ఇప్పుడు, 'SSC JHT 2023' రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి

• ముందుగా ప్రాథమిక వివరాల(basic details)తో రిజిస్టర్‌ చేసుకోండి

• దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి

• డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి.

• దరఖాస్తు రుసుము చెల్లించండి.

• భవిష్యత్ సూచన కోసం కాపీని ప్రింటవుట్ తీసుకోండి.

ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను కలిగి ఉంటుంది. పేపర్-2 డిస్‌క్రిప్టివ్‌ టైప్‌లో ఉంటుంది. పేపర్-1లో ప్రతి రాంగ్‌ ఆన్సర్‌కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

Click here for Notification PDF

Advertisment
Advertisment
తాజా కథనాలు