SSC JE Recruitment: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ జేఈ(SSC JE) రిక్రూట్‌మెంట్ పరీక్ష నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది. మీరు కూడా ఎస్‌ఎస్‌సీ జేఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందో మేం మీకు చెప్పబోతున్నాం.
విడుదల తేది ఎప్పుడు?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 29న జూనియర్ ఇంజనీర్ (SSC JE పరీక్ష 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
పరీక్ష తేదీ ఎప్పుడు?
జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం టైర్ 1, టైర్ 2 పరీక్షలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూన్ 4, జూన్ 5, జూన్ 6, 2024న పరీక్షలు జరుగుతాయి. మే చివరి వారంలో అడ్మిట్ కార్డు విడుదలయ్యే అవకాశం ఉంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
WATCH: