SSC క్యాలెండర్ అవుట్.. పరీక్ష తేదీలు ఎప్పుడంటే? స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)కి సంబంధించి అధికారిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది. ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జాబ్ క్యాలెండర్ చూసుకోవచ్చు. SSC CHSL, JE పరీక్షలకు సంబంధించి తేదీలను ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. By Trinath 19 Aug 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి SSC Exams 2023 Calendar: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల 2023 క్యాలెండర్‌ను విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో నిర్వహించే పరీక్షల కోసం క్యాలెండర్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక ప్రకటనను SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో చెక్ చేసుకోండి. Click here for SSC calendar షెడ్యూల్ ప్రకారం.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (టైర్-2) అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్.. (టైర్-2) నవంబర్ 2న పెట్టనున్నారు. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) పరీక్ష, (పేపర్-2) డిసెంబరు 4న నిర్వహించనున్నారు. ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (టైర్-2) డిసెంబర్ 22న నిర్వహించనున్నారు. • SSC పరీక్షలు 2023 క్యాలెండర్‌ని వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేయాలి: పరీక్ష క్యాలెండర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి: స్టెప్ 1: SSC అధికారిక సైట్‌ని ssc.nic.in ని విజిట్ చేయండి . స్టెప్ 2: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న SSC పరీక్షల 2023 క్యాలెండర్ లింక్‌పై క్లిక్ చేయండి. స్టెప్ 3: అభ్యర్థులు పరీక్ష తేదీలను చెక్ చేసుకునేందుకు కొత్త PDF ఫైల్ ఓపెన్ అవుతుంది స్టెప్ 4: పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేయండి.. వీలుంటే హార్డ్ కాపీని కూడా ప్రింట్ తీసుకోండి. • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్లు సంఖ్య లక్షల్లో ఉంటుంది. గతంలో SSC పరీక్షల నిర్వహణలో కాస్త గందరగోళం ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి కాస్త మారుతూ వచ్చింది. ఇప్పుడు ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తోంది. • JE, CGL, CHSL, SI పరీక్షల కోసం SSC అడ్మిట్ కార్డ్ 2023: కమీషన్ రాబోయే జూనియర్ ఇంజనీర్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్, ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్‌ల అడ్మిట్ కార్డ్‌లను పరీక్షకు 15 రోజుల ముందు అప్‌లోడ్ చేస్తారు. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం SSC అధికారిక వెబ్‌సైట్‌పై ఓ లుక్కేసి ఉంచండి. #jobs #ssc-chsl #ssc-jobs #ssc-job-calendar #ssc-exam-calendar-2023-24-out #ssc-exam-calendar-out #ssc-exam-dates-2023 #ssc-chsl-exam-date #ssc-sgl-exam-dates #ssc-exam-schedule-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి