SS Rajmouli: డబ్బింగ్ చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్న జక్కన్న కొడుకు! మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ప్రేమలు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ రైట్స్ ను జక్కన్న కుమారుడు కార్తీకేయ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను మార్చి 8న తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం. By Bhavana 28 Feb 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Premalu: ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు భారీ హిట్లను (Super Hits) అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంటున్నాయి. అలాంటి వాటిలో మలయాళ చిత్రం ప్రేమలు (Premalu) కూడా ఒకటి. ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగోడుతుంది. చాలా తక్కువ బడ్జెట్ రూ.3 కోట్ల తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ. 60 కోట్ల కలెక్షన్ మార్కును దాటేసింది. భాగ్య నగరం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకొంది. దీంతో ఈ చిత్రం తెలుగులోకి ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలా కోరుకునే వారందరికి ఓ గుడ్ న్యూస్..ఏంటంటే ప్రేమలు చిత్రంలో త్వరలోనే తెలుగులోకి డబ్బింగ్ కాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది మరెవరో కాదు.. జక్కన్న కుమారుడు కార్తీకేయ. ఈ చిత్రం ఓటీటీ ప్లే రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు హక్కులను ఎస్ఎస్ కార్తీకేయ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి డబ్బింగ్ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే సినిమా విషయం గురించి అధికారిక ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెల 8 న ప్రేమలు చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేసేందుకు కార్తీకేయ ప్లాన్ చేస్తున్నట్లు సమచారం. ఈ చిత్రానికి గిరీశ్ ఏడీ డైరెక్టర్ గా ఉండగా.. నెల్స్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ లు కలిసి నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో ఇంజినీరింగ్ చదువుతాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి ని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పాడు. చదువు పూర్తయిన తరువాత విదేశాలకు వెళ్లాలి అనుకుంటాడు కానీ.. వెళ్లలేడు. దాంతో సొంత ఊరు నుంచి హైదరాబాద్ కి కోచింగ్ కోసం వస్తాడు. అక్కడ హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఈ విషయం గురించి ఆమెతో చెబుతాడా.. వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేదే కథ. Also read: వాతావరణం మారిపోయింది.. మళ్లీ కొత్త సమస్యలు మొదలవుతున్నాయి జాగ్రత్త! #premalu #karthikeya #ss-rajamouli #malayalm-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి