Srimanthudu Case: శ్రీమంతుడు.. మన దర్శక-నిర్మాతలకే కాదు.. హీరోలకూ ఓ వార్నింగ్!

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ కాపీ అని సుప్రీం కోర్టు కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కథల విషయంలో నిర్మాతలు, హీరోలు కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇమేజి డ్యామేజీ కావడం గ్యారెంటీ 

Srimanthudu Case: శ్రీమంతుడు.. మన దర్శక-నిర్మాతలకే కాదు.. హీరోలకూ ఓ వార్నింగ్!
New Update

Srimanthudu Story Copy Case: ఏదైనా ఒక విషయం.. ఒక సంఘటన.. ఒక కథ.. ఒక సినిమా లేదా సీన్ ప్రేరణ వేరు.. కాపీ వేరు. ఈ రెండిటి మధ్య మామూలుగా పెద్ద తేడా ఏముంది అనుకుంటాం. కానీ, ప్రేరణ మనం వాడుకలో చెప్పుకునే ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా ఒక విషయం తెలిస్తే దాని ఆధారంగా మనం కొత్తగా ఏదైనా చెప్పడం. కాపీ అంటే.. ఆల్రెడీ ఒకరు చెప్పిన.. రాసిన.. తీసిన విషయాన్ని మక్కీకి మక్కీ తీసుకొచ్చి మన గొప్పగా చెప్పుకోవడం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం తెలియాలి అంటే ఈ కథనం చదవాల్సిందే. 

ప్రస్తుతం..

ఈమధ్య ఓ రెండురోజుల క్రితం సుప్రీం కోర్టు..  మహేష్ బాబు-కొరటాలశివల (Mahesh Babu-Koratala Shiva) సూపర్ హిట్ సినిమాకి సంబంధించి వెలువరించిన తీర్పు. ముందు ఈ తీర్పు ఏమిటంటే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు (Srimanthudu Movie) పక్కా కాపీ కథ. దానిలో డౌట్ లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే. మీరు పిటిషన్  వాపసు తీసుకుంటారా? మమల్ని డిస్మిస్ చేయమంటారా అంటూ సుప్రీం సీరియస్ అయింది. ఇప్పుడు మరింత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.. 

ఫ్లాష్ బ్యాక్..

కొరటాల శివ దర్శకత్వంలో నిర్మాత నవీన్ యెర్నేని, మహేష్ బాబు సంయుక్తంగా  శ్రీమంతుడు అనే సినిమా తీశారు. ఇది 2015 ఆగస్టు 7న రిలీజ్ అయింది. సూపర్ హిట్ సినిమాగా.. మహేష్ బాబు కెరీర్ లోనే ఒక మంచి సినిమాగా నిలిచింది. ఆ తరువాత అసలు సినిమా థియేటర్ల బయట మొదలైంది. ఈ సినిమా కథ నేను స్వాతి మ్యాగజైన్ కు (Swathi Magazine) రాసిన చచ్చేంత ప్రేమ కథ. దీనిని  కాపీ కొట్టారు అంటూ శరత్‌చంద్ర అనే రచయిత దర్శకుడు కొరటాల, నిర్మాతలు నవీన్ యెర్నేని, మహేష్ బాబులపై మోసం, ఫోర్జరీ కేసులు పెట్టాలంటూ హైకోర్టు ను అభ్యర్థించారు. దీనిపై శ్రీమంతుడు సినిమా దర్శక, నిర్మాతలు ఆ కథ కాపీ కాదంటూ కౌంటర్ దాఖలు చేశారు. అయితే, జస్టిస్ కె సురేందర్..  8 మంది సభ్యుల రచయితల కమిటీ ఈ విషయాన్ని పరిశీలించి.. రెండువైపులా వాదనలు విని.. రెండు కథలనూ పోస్టుమార్టం చేసి.. శ్రీమంతుడు కథ శరత్ చంద్ర కథకు కాపీ అని నిర్ధారించారు. అయితే, దీనిలో తప్పు కొరటాల శివదే అనీ.. నిర్మాతలకు సంబంధం లేదనీ నవీన్ యెర్నేని, మహేష్ బాబులను కేసు నుంచి మినహాయించారు. ఈ తీర్పుపై కొరటాల శివ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. శ్రీమంతుడు కాపీ కథేనని చెబుతూ ఇందాకా మనం చెప్పుకున్న తీర్పు చెప్పింది. 

ఇది శ్రీమంతుడు  విషయం. ఇది తాను ఇష్టపడి రాసుకున్న కథను ఇంకొకరు కాపీ కొట్టారు అని తెలిసిన తరువాత ఒక రచయిత పడిన వేదనకు దొరికిన రిలీఫ్. శరత్ చంద్ర గట్టిగా పట్టుబట్టి పోరాటాం చేశారు కాబట్టి.. నిజాన్ని వెలికితీయగలిగారు. కానీ, ఇలాంటి కథలు.. కథకులు ఎన్నో మన దర్శక ధీరుల కాపీ కళలో చిక్కుకుపోయిన సంఘటనలు కోకొల్లలు. గతంలో టెక్నాలజీ లేదు.. అప్పుడు ఎక్కడో ప్రింట్ అయితే.. దానిని చదివేసి.. యధావిధిగా తెచ్చేసి.. చిన్న మార్పులతో సినిమా తీసేసి వదిలేసేవారు. దానిని గుర్తించినా ఒరిజినల్ రచయితలు కోర్టుకు వెళ్లడం.. ఎప్పుడోకానీ జరిగేది కాదు. ఒకవేళ కోర్టుకు వెళ్లినా అది ఎదో ఒక స్టేజిలో రాజీకి వచ్చేసేది. ఇంకా దారుణం ఏమిటంటే.. మన రచయితలు ఇంగ్లీష్ నవలల్ని యధాతథంగా కాపీ కొట్టేసి సొంత నవలలా బిల్డప్ ఇచ్చేసి.. తెలుగులో రాసేస్తే.. అమాయక పాఠకులు అది చదివి ఆహా.. ఓహో అంటే.. దానిని కాపీ కొట్టి మన దర్శకులు సినిమాలుగా తీసేసి ప్రేక్షకులకు అందించిన సినిమాలూ చాలా ఉన్నాయి. అయితే ఇదంతా గతంలో చెల్లింది. ఇప్పుడు అలా కాదు. 

Also Read: అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది 

టెక్నాలజీ.. రచయితల్లో వచ్చిన చైతన్యం.. సోషల్ మీడియా.. ప్రేక్షకుల్లోనూ.. పాఠకుల్లోనూ వచ్చిన మార్పు.. కాపీ కథల్ని అంతెందుకు.. చిన్న సీన్ కూడా గుర్తు పెట్టేస్తున్నారు. కనీసం ఎవరిదైనా కథలో మంచి లైన్ ఉందని ఆ లైన్ తీసుకుని అద్భుతంగ విజువలైజ్ చేసినా సరే దాన్ని కూడా ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. ఇక్కడ కొరటాల తప్పు చేశారా? ఒప్పు చేశారా అనే చర్చ అవసరం లేదు. నిస్సందేహంగా కాపీ జరిగింది. అందులో ఎంత కాపీ.. అనే డౌటూ  సమర్ధనల కోసం వెతుకులాటలు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. శరత్ చంద్ర కథ.. శ్రీమంతుడు కథ. 8 మంది కథారచయితల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. 

దర్శకులే కాదు.. నిర్మాతలు.. హీరోలు కూడా.. 

ఈ సంఘటన తరువాత దర్శకులు ఒక్కరే కాదు.. నిర్మాతలు.. హీరోలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. కాపీ కథ అని తెలిస్తే రిజక్ట్ చేయాల్సిన బాధ్యత హీరోకి కూడా ఉంది. ఇటీవల విడుదలైన ఒక సినిమా విషయంలో ఆ సినిమా షూటింగ్ లో ఉండగా హీరోకి ఆ కథ కాపీ అని తెలిసింది. దీంతో ఒరిజినల్ రైటర్ ని పిలిపించి ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చి.. తన సినిమా రచయితను పక్కకు తప్పుకోమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆసినిమా కూడా హిట్ అయింది. 

సో.. ఏతావాతా చెప్పేది ఏమిటంటే.. ఈకాలంలొ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు.. దర్శకులు కథలు లేపుకొచ్చేద్దాం.. రీళ్లు చుట్టేద్దాం అంటే కుదరదు. ఒరిజినాలిటీ మస్త. ఒకవేళ లేపుకొచ్చినా.. ఒరిజినల్ రైటర్ కి క్రెడిట్స్.. రెమ్యునరేషన్ ఇచ్చి గౌరవించి.. మన మర్యాద నిలబెట్టుకోవడం చాలా చాలా అవసరం అని శ్రీమంతుడు చెబుతున్న నీతి. తన కథ మీద చచ్చేంత ప్రేమ ఉన్న రచయిత కథలు దోచుకోవడం ఎవరి తరం కాదని శరత్ చంద్ర నిరూపించి కథా రచయితలకు స్ఫూర్తి అయ్యారు. 

Watch this Interesting Video :

#srimanthudu-case #koratala-shiva #mahesh-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe