Sreeleela: లవ్ లో పడ్డ శ్రీలీలా.. ఏకంగా కోట్ల అధిపతినే బుట్టలో వేసిందిగా! స్టార్ నటి శ్రీలీలా ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. తాను చదివే కాలేజీలోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అతను బడా పొలిటికల్ లీడర్ మనవడని, వేల కోట్లకు ఏకైక వారసుడని సమాచారం. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 22 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sreeleela: ఎట్టకేలకు యంగ్ బ్యూటీ శ్రీలీలా ప్రేమ వ్యవహారం బయటపడింది. కొంతకాలంగా ఆమె సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా శ్రీలీలా ప్రేమికుడేవరో కనిపెట్టేశారు ఫ్యాన్స్. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా ప్రియుడితోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని చర్చకు తెరలేపారు. అంతేకాదు ఆ కుర్రాడు ఒక రాజకీయా నాయకుడి వారసుడని కూడా పలు ఆధారాలు బయటపెట్టారు. Grateful and humbled 🫶🏻🙏✨ pic.twitter.com/j9xudazz0y — sreeleela (@sreeleela14) June 15, 2023 పొలిటికల్ లీడర్ మనవడతో.. ఈ మేరకు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి MBBS పూర్తి చేసి పనిలో ఉన్న నటి.. అదే కాలేజీలో చదువుతున్న అబ్బాయితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అతను ఓ బడా పొలిటికల్ లీడర్ మనవడని, వేల కోట్లకు ఏకైక వారసుడని కూడా సమాచారం. అంతేకాదు ప్రస్తుతం శ్రీలీల షూటింగ్స్ కూడా లేకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు చేస్తుందట. పార్టీలు, పబ్ లకు తెగ ఎంజాయ్ చేస్తోందంటూ ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు. ఇక ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. బాలకృష్ణ, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక శ్రీలీల తన యాక్టింగ్, అందం, డాన్స్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. #dating-rumours #sreeleela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి