సనాతన పరిరక్షణ కోసమే దేవాలయాలు

గురుపరంపరను, సనాతన పరిరక్షణకై దేవలయాలు. ప్రధానం అని వాటి బాధ్యత హిందూ సామ్రాజ్యాన్ని శంకర భగవత్పాదులు రక్షించక పోయిఉంటే, కాలగర్భంలో కలిసిపోయేవి అని అన్నారు శృంగేరి శివగంగా మఠాధీశ్వరులు శ్రీ శ్రీ పురుషోత్తమ భారతీ స్వామి.

New Update
సనాతన పరిరక్షణ కోసమే దేవాలయాలు

Sri Sri Purushottama Bharti Swamy is the Sringeri Sivaganga Mathathiswaru

శృంగేరి శివగంగా మఠాధీశ్వరులు శ్రీ శ్రీ పురుషోత్తమ భారతీ స్వామి వారు విజయయాత్రలో భాగంగా ఈరోజు ఓరుగల్లుకు వచ్చారు. వరంగల్‌లోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారిని శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వారు దర్శించారు. వారికి దేవాలయ వంశపారం పర్య అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద స్వస్తితో ఆలయప్రదక్షిణంగా అమ్మవారిని దర్శించి.. అమ్మవారికి మంగళనీరాజనములు సమర్పించిన తర్వాత అన్నదాన మండపంలో పాదుకాపూజ నిర్వహించారు. పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మంత్రాక్షతలు ఫలాలు ప్రసాదంగా అందించారు.

భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలు

దేవాలయ ప్రాశస్త్యాన్ని వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని, దేవాలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలను దేవాలయ ఇతిహాసాన్ని, చరిత్రను తెలుపుతూ గతంలో శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి దర్శించిన విషయాన్ని తెలిపారు. గురుపరంపరను, సనాతన పరిరక్షణ కై దేవలయాలు ప్రధానం అని ఈ సందర్భంగా స్వామి అన్నారు. హిందూ సామ్రాజ్యాన్ని శంకర భగవత్పాదులు రక్షించక పోయిఉంటే కాలగర్భంలో కలిసిపోయేవని చెప్పారు. ధర్మ ఆచారాన్నినాలుగు పీఠాలుగా స్థాపన చేశారని చెబుతూ.. ఇవాళ శృంగేరి పీఠం అంటే ధర్మపీఠంగా భాసిల్లుతుందని ఆ పీఠ ప్రాశస్త్యాన్ని చెప్పారు. ఆ పీఠం పరంపరలో వస్తున్న శివగంగా పీఠాథిపతులు రావడంతో పెద్ద ఎత్తున  భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సేవకులు పాల్గొని ప్రసాద వితరణ చేయడం జరిగినది. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు