Bhadrachalam : అయోధ్య రాముడు నడయాడిన తెలుగు నేల భద్రాచలం

ఆదర్శపురుషుడు శ్రీరాముడు అందరికీ దేవుడు. రాముడిని కొలవని ఎవరూ ఉండరు. అయితే అయోధ్యలో పుట్టి పెరిగిన రామయ్యతో తెలుగు వారికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ రామచంద్రుడు నడయాడిన నేల మన తెలంగాణలోనే ఉంది. గోదావరీ తీరంలో ఉన్న భద్రాచలంలోనే రాముడు కొలువై ఉన్నాడు.

New Update
Bhadrachalam : అయోధ్య రాముడు నడయాడిన తెలుగు నేల భద్రాచలం

 Bhadrachalam Sir Ramalayam : దక్షిణ భారతదేశం(South India) లో గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం(Bhadrachalam). మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు వరం ఇస్తాడు ఆ వరం ప్రకారం సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడితో కలిసి ఇక్కడ వెలిశాడనేది స్థలపురాణం. ఇక్కడి శ్రీరామచంద్రుణ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడు, చతుర్భుజ రాముడు, భద్రగిరి నారాయణుడనే పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం వెనుక చాలానే చరిత్ర ఉంది.

త్రేతాయుగంలో భద్రాచలం ఒక పెద్ద అటవీ ప్రాంతం(Forest Area). తండ్రి మాట కోసం వనవాసం వచ్చిన రాముడు ఇకకడ మన భద్రాద్రిలోనే రెండున్నరేళ్ళు గడిపాడని...ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఉంటాయని చెబుతారు. ఇక్కడ ఉండే పర్ణశాలలో రాముడు ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేవాడని చెబుతారు. రామాయణం(Ramayana) లో ముఖ్యఘట్టానికి కూడా నాందీ పలికింది ఇక్కడే. ఈ పర్ణశాలలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసింది. సీత బంగారు జింకను చూపింది. రావణుడు సీతను ఎత్తుకెళ్ళింది కూడా ఇక్కడే. ఇకకడి నుంచి రాముడు సీతను వెతుక్కుని లంకకు వెళ్ళాడు.

ఇక భద్రునికిచ్చిన మాట ప్రకారం రాముడు ఇక్కడ కొలువయ్యాడు. అయితే అప్పుడు రాముడికి గుడి ఉండేది కాదు. అడవిలో ఉండే విగ్రహాలకు పోకల దమ్మక్క అనే ముసలామె చిన్న పాక నిర్మించి పూజించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమెకు కలలో రాముడుకనిపించి తనకు గుడి కట్టించమని చెబుతాడు. దీనికి మరో పరమ భక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశిస్తాడు. ఆ తరువాత దమ్మక్క..అప్పటి తాసీల్దారు కంచెర్లగోపన్నను కలవడం..ఆయన తరువాత రామునికి పరమ భక్తుడిగా మారడం జరిగింది. ఈ కంచెర్ల గోపన్నే రామదాసు. కబీర్ దాసు శిష్‌యుడైన ఈయన పాటలు ఇప్పటికీ కర్ణాటక సంగీతంలో పాడుతున్నారు. ప్రతీ తెలుగు వారి నోటా వినిపిస్తాయి. భద్రాచల రాముడు చిన్న పాక కింద ఉండడం చూడలేని రామదాసు ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో ఆలయాన్ని నిర్మిస్తాడు. దీంతో అప్పటి రాజైన తానీషా ఆగ్రహానికి కూడా గురవుతాడు. రామదాసును చెరలో బంధించి తానీషా నానా హింసలు పెడతాడు. అయితే తర్వాత స్వయంగా రాముడే తానీషా కలలో కనిపించి..డబ్బులు ఇవ్వడం, రామదాసును విడిపించు అని చెప్పడం జరుగుతుంది.

అప్పుడు రాయదాసు(Ramadas) కట్టిన గుడే ప్రస్తుతం భద్రాచలం ఉన్న రాములోరి గుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రాముడు, సీతా, లక్ష్మణ సమేతంగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. దక్షిణ బారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రామాలయాల్లో భద్రాచాలం కూడా ఒకటిగా మారింది. ఇక్కడ ప్రతీయేటా రామనవమి నాడు నిర్వహించే రాములోరి పెళ్ళి అత్యంత విశిష్టమైనది, ప్రఖ్యాతి గాంచినది.

Also Read:Srirama Navami 2024: జగదానంద కారకుడు.. రాములోరి పెళ్లిరోజు.. జన్మదినం ఒక్కరోజే.. ఎందుకంటే

#sir-ramalayam #bhadrachalam #sir-rama
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు