సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు! శ్రీలంక అధ్యక్ష ఎన్నికలను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా ప్రకటించింది. 2022 లో ఆర్థిక సంక్షభంతో గోటబయ రాజపక్సే అధ్యక్ష పదవికీ రాజీనామా చేశారు.ఆ సమయంలో అన్నిపార్టీల మద్ధతుతో ఆ బాధ్యతలను రణిల్ విక్రమ సింగే చేపట్టారు. By Durga Rao 27 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మన పొరుగు దేశమైన శ్రీలంక 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఫలితంగా దేశంలో ప్రజా విప్లవం చెలరేగింది. దీన్ని ఎదుర్కోలేక అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి సింగపూర్‌లో తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అన్ని పార్టీల మద్దతుతో అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘే పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది, దీని తరువాత, దేశంలోని అన్ని పార్టీలు నిర్దిష్ట వ్యవధిలో అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని శ్రీలంక ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్థిక సంక్షోభం తర్వాత జరిగే తొలి అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. అదేవిధంగా న్యాయశాఖ మంత్రి విజయదాస రాజపక్సే, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ, అధ్యక్షుడు అనురా కుమార దిసానాయక, మాజీ ఆర్మీ కమాండర్ శరత్ ఫోన్సెకా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. #sri-lanka #presidential-election మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి