Sri Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం! ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య బంగారు పతకం సాధించాడు. యునైటెడ్ కింగ్డమ్ బాత్లో జరిగిన 65వ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థి బృందం నాలుగో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ విద్యార్థులపై ప్రశంసలు కురిపించారు. By srinivas 22 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి 2024 International Mathematical Olympiad: విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది ప్రతిభ గల విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఆరుగురు విద్యార్థుల భారత బృందం.. యునైటెడ్ కింగ్డమ్ లోని బాత్లో ఇటీవల ముగిసిన 65వ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో భారతదేశానికి చెందిన ఆరుగురితో కూడిన విద్యార్ధి బృందం నాలుగు బంగారు పతకాలు ఒక రజిత పతకంతో ప్రపంచంలోనే నాలుగొవ ర్యాంకులో నిలిచింది. ఈ ఆరుగురు విద్యార్థులు ఉన్న భారత బృందంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బావదాన్ పూణే కు చెందిన విద్యార్థి ఎం.వి ఆదిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం. It’s a matter of immense joy and pride that India has come 4th in its best-ever performance in the International Maths Olympiad. Our contingent has brought home 4 Golds and one Silver Medal. This feat will inspire several other youngsters and help make mathematics even more… — Narendra Modi (@narendramodi) July 21, 2024 అసాధారణమైన విజయం మోదీ.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య మాంగుడిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనలో 4వ స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషం, గర్వించదగ్గ విషయమన్నారు. మా బృందం నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఈ ఫీట్ అనేక ఇతర యువకులకు స్ఫూర్తినిస్తుంది. గణితాన్ని మరింత ప్రాచుర్యం పొందడంలో సహాయపడుతుందని, ఈ అసాధారణమైన విజయం దేశానికి గర్వకారణం అంటూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.వి అదిత్య, ఇతర విద్యార్థి బృందానికి మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధించి భారతదేశాన్ని ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలబెట్టిన ఈ ఆరుగురు విద్యార్థులకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ, శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ అభినందనలు తెలిపారు. ఈ ఆరుగురు విద్యార్థుల బృందంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.వి ఆదిత్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పూణే భావధాన్ విద్యార్థి కావడం తమకెంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆదిత్య మాంగుడి 6వ తరగతి నుంచే శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి అని, ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడని, ఐఎంఓ 2024లో బంగారు పతకం సాధించడం వెనుక స్కూల్ స్థాయి నుంచే ఆదిత్య అంకితభావం, కృషి, అసాధారణమైన ప్రతిభ ఉన్నాయని కొనియాడారు. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనే కాకుండా నాసా, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో సైతం శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యార్థులు వరుసగా సాధించిన విజయాలను గుర్తు చేశారు. 2001లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ భారతదేశం తరపునుంచి శశాంక్ శర్మ ఏడో స్థానంలో నిలిచారు. అయితే 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్న భారత విద్యార్ధి బృందంలో కీలక భూమిక పోషించిన ఆదిత్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి కావడం గర్వంగా ఉందని అన్నారు. #aditya #gold-medal #sri-chaitanya #international-maths-olympiad-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి